సాక్షి, పెద్దపల్లి: ఉమ్మడి జిల్లానుంచి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ‘అధ్యక్షా’ అని పిలవాలనుకున్న మహిళా ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరాశే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో 14,96,023మంది మహిళా ఓటర్లు ఉండగా, బీజేపీ నలుగురికి, బీఎస్పీ ఒకరికి పోటీచేసేందుకు అవకాశం కల్పించాయి. బీజేపీ అభ్యర్థు లుగా రామగుండం నుంచి కందుల సంధ్యారాణి, సిరిసిల్ల నుంచి రాణిరుద్రమ, జగిత్యాల నుంచి భో గ శ్రావణి, చొప్పదండి నుంచి బోడిగె శోభ, పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థిగా దాసరి ఉష బరిలో నిలిచారు. శ్రావణి ప్రత్యర్థులకు ధీటుగా ఓట్లు సాధించగా, మిగిలిన అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
● ప్రధాన పార్టీల నుంచి బరిలో ఐదుగురు
● అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఒక్కరికీ దక్కలేదు