
మంథని : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తన చేతిలోకి తీసుకొని చేసిన అరాచకాలను ప్రజలు గుర్తు పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకున్నారు. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం ఉండకూడదని, ఇక్కడ శాంతి నెలకొనాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పిస్తాం. ఆరు గ్యారెంటీలతోపాటు మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేస్తాం. ధరణి, సాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నా విజయానికి సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అన్నివర్గాల ప్రజలకు కృతజ్ఞతలు.
– దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే
పేదల సంక్షేమానికి కృషి
అధైర్యపడొద్దు