
విజయ సంకేతం చూపుతున్న శ్రీధర్‌బాబు
గోదావరిఖని: రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆదివారం పెద్ద ఎత్తున వి జయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంథని జేఎ న్టీయూ కౌంటింగ్ కేంద్రం నుంచి యైటింక్లయిన్‌కా లనీ, పోతనకాలనీ మీదుగా గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్టీపీసీలో..
జ్యోతినగర్(రామగుండం): ఐఎన్టీయూసీ నాయకులు ఎన్టీపీసీలో సంబురాలు జరుపుకున్నారు. రామగుండం ఎమ్మెల్యేగా రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ వి జయంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల వి జయంపై ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా ఆదేశాలతో నాయకులు బాణ సంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. నాయకులు కాసర్ల వెంకటస్వామి, బండారి కనకయ్య, కందుల స్వామి, ఆరేపల్లి రాజేశ్వర్, ఎం.శ్రీనివాస్, మేరుగు రాజనర్సయ్య, వేముల కృష్ణయ్య, బొద్దుల శ్రీనివాస్, నేరెళ్ల రమేశ్, వేముల మల్లేశ్, కట్ట రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంథనిలో..
మంథని: కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. శ్రీధర్‌బాబు గెలుపుకోసం పార్టీ శ్రేణులు నెల రోజుల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ఆయన గెలుపుతో పెద్దఎత్తున బాణసంచా కాల్చుతూ స్వీట్లు పంచారు. అన్ని గ్రామాల్లో సంబురాలు మిన్నంటాయి. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. విజయం సొంతం కావడంతో అప్పటివరకు మంథనిలో ఉన్న ఎమ్మెల్యే.. రామగిరి జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వరకు పెద్దఎత్తున శ్రేణులతో కలిసి తరలి వచ్చారు. అంతకు ముందు మంథని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే తన తండ్రి దివంగత శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సుల్తానాబాద్‌లో..
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు వారిని సన్మానించారు. దారి పొడవునా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ, భారీ ఆధిక్యం ఇచ్చిన ఓటర్లకు సేవకుడిగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్వల శ్రీనివాస్, అక్బర్ అలీ, దామోదర్‌రావు, అన్నయ్యగౌడ్, పుష్పలత, రాజయ్య, రఫిక్, రాజు, వరప్రదీప్, రవీందర్, కిశోర్, సంతోష్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, రామారావు, ప్రశాంత్‌రావు, లక్ష్మణరావు, పురుషోత్తంరావు, సంపత్‌రావు, సతీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి, రామగుండం, మంథనిలో అంబరాన్ని అంటిన సంబురాలు

వియజరమణారావును సన్మానిస్తున్న నేతలు

గోదావరిఖనిలో మక్కాన్‌సింగ్ విజయోత్సవం