
భద్రతా విధుల్లో పోలీసు బలగాలు
మంథని: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామగిరి మండలం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అధికారులు అన్నిఏర్పాట్లు సిద్ధం చేశా రు. శనివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అధి కారులకు శిక్షణ కూడా పూర్తిచేశారు. జేఎన్టీయూలోని బ్లాక్–2లో జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఓట్లను ఆదివారం లెక్కిస్తారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు, ఒక పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతీ టెబుల్ వద్ద సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారన్నారు. ప్రతీ ని యోజకవర్గానికి మూడు రిజర్వు బృందాలు, మూ డు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలను నియమించామన్నారు. మంథని నియోజకవర్గంలో కౌంటింగ్ 20 రౌండ్లలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. 14 టేబుళ్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మొత్తం 64 మంది అధికారులు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. కాగా వెయ్యి పోస్టల్ బ్యాలెట్లు, 1,95,635 పోలైన ఓట్లను అధికారులు ఆదివారం లెక్కించనున్నారు.
కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు శిక్షణ