
ర్యాలీ ప్రారంభిస్తున్న సీనియర్ సివిల్‌జడ్జి అర్జున్
● సీనియర్ సివిల్ జడ్జి ఎం.అర్జున్
పెద్దపల్లిరూరల్: ఎయిడ్స్ నియంత్రణపై అనుమానాలు నివృత్తి చేస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలని సీని యర్ సివిల్ జడ్జి ఎం.అర్జున్ సూచించారు. ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన ర్యాలీని జడ్జి అర్జున్ జెండా ఊపి ప్రా రంభించారు. జాతీయ సగటు కంటే తెలంగాణలో హెచ్‌ఐవీ కేసులు అధికంగా నమోదవుతున్నాయని జడ్జి తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ, ఎయిడ్స్ నియంత్రణకు అనుసరించాల్సిన పద్ధతులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రమాకాంత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.