
సాక్షి, పెద్దపల్లి: మహిళల కోసం ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాలు, ఆదర్శ పోలింగ్ స్టేషన్లు.. వీటితోపాటు మరెన్నో సదుపాయాలు కల్పించింది, ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అయినా, గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం అధికార యంత్రాంగంతోపాటు, అభ్యర్థులను ఆలోచనల్లో పడేశాయి. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి నష్టం చేకూర్చుతుందోనని పలువురు నేతలు లెక్కల్లో మునిగి తేలుతున్నారు.
5,54,897 మంది ఓటేశారు..
● పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో 2,54,266 మంది ఓటర్లకు 2,07,397 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడటంతో 81.57 శాతం పోలింగ్ నమోదైంది.
● మంథని నియోజకవర్గంలో 2,36,442 మందికి 1,95,635 మంది ఓటేయటంతో 82.74 శాతం పోలింగ్ నమోదైంది.
● రామగుండంలో 2,21,019 మందికి 1,51,865 మంది ఓటుహక్కు వినియోగించుకోవడంతో జిల్లాలోనే అతి తక్కువగా 68.71శాతం పోలింగ్ నమోదుకావడం గమనార్హం.
● మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,11,727 మంది ఓటర్లు ఉండగా, గురువారం జరిగిన ఎన్నికల్లో 77.96శాతంతో 5,54,897 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఆసక్తి చూపంది ఎవరు?
ఈసారి మూడు నియోజకవర్గాల్లో కలిపి మహిళలు 1,09,794మంది ఉండగా కేవలం 75,022 మంది మాత్రమే ఓటేశారు. పురుషులు 1,11,200 మంది ఉండగా అందులో 76,830మంది మాత్రమే ఓటేశారు. జిల్లాయంత్రాంగం పూర్తి స్థాయిలో ఓటు హక్కుపై అవగహన కల్పించడకపోవడం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు, చిరుద్యోగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేయకపోవడం పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
నియోజకవర్గం 2018 2023
రామగుండం 71.75 68.71
మంథని 85.14 82.74
పెద్దపల్లి 83.95 81.57
సరాసరి 80.28 77.96
గత ఎన్నికలకన్నా 2.60 శాతం తక్కువ నమోదు
ఆసక్తి చూపని మహిళా ఓటర్లు
పోలింగ్ శాతం ఇలా..