
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం తక్కువగా నమోదవుతుంది. చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
రాజన్నకు జనసందడి
వేములవాడ: కార్తీక శుక్రవారం వేములవాడ రాజన్నను 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా గణపతి హోమం
సుల్తానాబాద్: వేణుగోపాలస్వామి ఆలయంలోని సాంబశివాలయంలో గణపతి హోమం శుక్రవారం నిర్వహించారు.
శనివారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2023
ఎల్లంపల్లిలో అత్యధిక పోలింగ్
జ్యోతినగర్: రామగుండం అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎల్లంపల్లి పోలింగ్ కేంద్రం–14 పోలింగ్ శాతంలో రికార్డు నమోదు చేసింది.ఇక్కడ గురువారం 88.53 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని స్పందన క్లబ్ పోలింగ్ కేంద్రం–62లో 24.35 శాతం అతితక్కువ పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్టీపీసీ పీటీఎస్‌లోని –62 నంబరు పోలింగ్‌కేంద్రంలో 542 మంది ఓటర్లకు 132 మంది ఓటుహక్కును వినియోగించుకుని 24.35 శాతం నమోదు చేశారు.
ఉల్లాసంగా..
ఉత్సాహంగా..
పెద్దపల్లిరూరల్/మంథని: అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెరపడింది. అగ్రనేతల సభలు, రోడ్‌షోలతోపాటు ఊరూరా ఎన్నికల ప్రచారం చేస్తూ ఓట్ల వేటలో తలమునకలైన ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు నెలపాటు వారి కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ వచ్చారు. గురువారం పోలింగ్ ముగియడంతో వారికి విశ్రాంతి లభించింది. శుక్రవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లడం, టిఫిన్ తిని, చాయ్‌తాగుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. పోలింగ్ సరళిపై పార్టీ శ్రేణులతో ఆరా తీస్తూ కనిపించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు తన నివాసంలో పార్టీ శ్రేణులతో పోలింగ్ సరళిపై సమాలోచనలు చేశారు. అంతకుముందు మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై చర్చించారు. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తన కుటుంబసభ్యులతో ఇంట్లో ఉల్లాసంగా గడిపారు.
న్యూస్‌రీల్

కుటుంబసభ్యులతో కలిసి టీ తాగుతున్న విజయరమణారావు

బీఆర్‌ఎస్ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్న పుట్ట మధు

కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్తున్న దాసరి మనోహర్‌రెడ్డి

భార్యతో కలిసి భోజనం చేస్తున్న మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్

కుటుంబ సభ్యులతో బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి ప్రదీప్‌కుమార్