
బీఆర్‌ఎస్ ప్రభుత్వం, స్థానిక నాయకత్వం తీరుపై ప్రజల్లో తీవ్రమైన నిరసన ఉన్న క్రమంలో కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపినట్లు కనిపించింది. మంథని నియోజకవర్గంలో ముంపు సమస్య, స్థానిక నాయకత్వం వైఫల్యాలపై ప్రజలు తీవ్ర స్థాయిలో విసుగుచెందారు. అన్నింటిని గమనించిన నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారనే విశ్వాసం.
– దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే, మంథని
ప్రజలు ఆశీర్వాదించారనే నమ్మకం
పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం, తనను ఆశీర్వదించారనే విశ్వాసం కనిపించింది. ప్రజల ముఖల్లో కనిపించిన తీరు సంతోషాన్ని నింపింది. మరో మారు సేవ చేసే అవకాశం వస్తుంది. ప్రచార సమయంలో వారి రుణం తీర్చుకుంటానని ప్రజలకిచ్చిన హామీల మేరకు తప్పకుండా కట్టుబడి ఉంటా.
– పుట్ట మధు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంథని
బీజేపీని ఆదరించారు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసారి మంథని నియోజకవర్గంలో ప్రజలు బీజేపీని ఆదరించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంథనిలో మార్పును కోరుకున్నట్లుగానే ఓటింగ్ రూపంలో వారి చతురతను ప్రదర్శించిట్లుగా కనిపించింది.
– చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి, మంథని

