జగిత్యాలక్రైం: జగివత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన కొదురుపాక వెంకటి అనే వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటి భార్య ఐదేళ్ల క్రితం మృతిచెందింది. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. భార్య చనిపోయిందనే బెంగతో పాటు ఒంటరిగా ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ మన్మథరావు తెలిపారు.