
బండారి కనకయ్య
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు కార్మిక సంఘం (ఐఎన్టీ యూసీ మజ్దూర్ యూనియన్) ప్రధాన కార్యదర్శిగా బండారి కనకయ్య నియమితులయ్యారు. ఇది వరకు పని చేసిన కొలిపాక మల్లయ్య తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో యూనియన్ సెక్రటరీ జనరల్ బాబర్ సలీం పాషా ఆయన స్థానంలో కనకయ్య పేరును మంగళవారం ప్రకటించారు. జాతీయస్థాయి నాయకుడిగా ఉన్న ఆయన మరోసారి స్థానిక గుర్తింపు సంఘంలో కీలక బాధ్యతలు చేపట్టారు. తనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన సెక్రటరీ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.