కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

Published Sat, Mar 18 2023 12:06 AM

-

రామగిరి(మంథని): ముత్తారం మండలం ల క్కారం గ్రామానికి చెందిన పంజాల శ్యామల(40) వివాహిత కడుపు నొప్పి భరించలేక క్రి మిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తారం ఎస్సై రాములు కథనం ప్రకారం.. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయం ప్రతిష్ఠాపనోత్సవాలకు కొడుకు శ్రీకాంత్‌తో గురువారం సాయంత్రం కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఈక్రమంలో శ్యామలకు విపరీతంగా కడుపు లేవడంతో శ్రీకాంత్‌ స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకువచ్చేలోపు క్రిమిసంహారక మందుతాగి అపస్మారక స్థితికి చేరడంతో గమనించిన శ్రీకాంత్‌ తన స్నేహితుడి సాయంతో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచనతో కరీంనగర్‌లోని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందింది. మృతురాలి కుమా రుడు శ్రీకాంత్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నదిలో దూకేందుకు యత్నం..

కాపాడిన రివర్‌ పోలీసులు

యైటింక్లయిన్‌కాలనీ: గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోదావరి బ్రిడ్జి పైనుంచి శుక్రవారం నదిలోకి దూకేందుకు యత్నించిన ఓ వ్యక్తిని రివర్‌ పోలీసులు కాపాడారు. టూటౌన్‌ పోలీసులు, రివర్‌ పోలీసులు కథనం ప్రకారం.. యైటింక్లయిన్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సమస్యలతో కొంతకాలంగా మానసికవేదనకు గురవుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది తన వాట్సప్‌లో మెడలో దండవేసుకుని ఫొటోపై ఓం శాంతి అని రాసుకుని గోదావరినది వద్దకు వచ్చి దూకేక్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రివర్‌ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. అన్ని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని టూటౌన్‌ సీఐ వేణుగోపాల్‌ సూచించారు. సదరు వ్యక్తిని కాపాడిన రివర్‌ పోలీసులను సీఐ అభినందించారు.

బీసీలకు 50శాతం

రిజర్వేషన్లు వర్తింపజేయాలి

పెద్దపల్లిరూరల్‌: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింప జేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి శ్రీమాన్‌ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీల సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ హాజరవుతున్నారని అన్నారు. నాయకులు రఘు, వెంకటేశ్‌, శంకర్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు

రామగుండం: రాజీవ్‌రహదారిపై కుందనపల్లి సమీపంలోని భారత్‌ పెట్రోల్‌ పంపు వద్ద శుక్రవారం ఎదురెదురుగా కారు–లారీ ఢీకొన్న ఘ టనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అంతర్గాత ఎస్సై బోగె సంతోశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన రావుల రఘు–సరోజన దంపతులు బెల్లంపల్లిలో ఓ వి వాహానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నా రు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి మధ్యలో ని డివైడర్‌ను ఢీకొట్టి కరీంనగర్‌వైపు కర్ర లోడుతో వెథ్తున్న లారీని ఢీకొంది. కారులో ఉన్న వా రికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement