ఆకలి చేయిస్తున్న విన్యాసం | - | Sakshi
Sakshi News home page

ఆకలి చేయిస్తున్న విన్యాసం

Feb 15 2026 9:38 AM | Updated on Feb 15 2026 9:38 AM

ఆకలి

ఆకలి చేయిస్తున్న విన్యాసం

ఆకలి చేయిస్తున్న విన్యాసం

విజయనగరం టౌన్‌: సర్కస్‌ అంటే ఓ జిమ్నాస్టిక్‌ ప్రదర్శన మాత్రమే కాదు. ఎందరో యువతీ యువకులకు కడుపు నింపే ఉద్యోగం. ప్రపంచమంతా తిరుగుతూ సాహస ప్రదర్శనలిస్తారు. ప్రాణాలను పణంగా పెట్టే విన్యాసాలకు చప్పట్లు కొడిచే చాలు పరవశించిపోతారు. జంతుపులపై నిషేధం విధించినప్పటి నుంచి సర్కస్‌ కళాకారులకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సర్కస్‌ ప్రదర్శనలను చూసేవారు కరువవ్వడం ఆ కళాకారులను కలవరపరుస్తోంది.

పూట గడిచేందుకు ఫీట్లు

స్థానిక పెద్దచెరువు రోడ్డు ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన ఉన్న మాన్సాస్‌ గ్రౌండ్స్‌లో ఇటీవల ప్రారంభమైన బింగో సర్కస్‌లో మంగోలియన్‌, ఆఫ్రికా, రష్యా, చైనా తదితర దేశాలు, మణిపూర్‌, మిజోరాం, మహారాష్ట్ర, అసోం, వెస్ట్‌ బెంగాల్‌, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 150 మందికి పైగా కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొన్నేళ్లుగా సర్కస్‌కు ఆదరణ తగ్గిపోవడంతో సరైన ఆదరణ లేక కళాకారులు పొట్ట నింపుకోలేని దుస్ధితిలో ఉన్నారు. తమకు రావాల్సిన రాయితీలపై అధికారులు కనీసం దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని వారు వాపోతున్నారు. 2017లో జిల్లాకు సత్యఅనసూయమాత ఆఫ్రికన్‌ సర్కస్‌ వచ్చింది. తర్వాత ఇన్నేళ్లకు బింగో సర్కస్‌ వచ్చింది. ఇప్పటికే 80శాతం సర్కస్‌ కంపెనీలు మూసేశారు. కోవిడ్‌లో పది శాతం మూతబడ్డాయి. మరో పదేళ్ల తర్వాత సర్కస్‌ అనేది కనిపిస్తుందా అనేది ప్రశ్నార్ధకమే..

జిమ్నాస్టిక్‌ విన్యాసాలతోనే నిర్వహణ

ప్రస్తుతం జిమ్నాస్టిక్‌ విన్యాసాలపైనే సర్కస్‌ ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. జంతువుల ప్రదర్శనను ప్రభుత్వం నిషేధించడంతో వీరి ప్రదర్శనలకు ఆదరణ కరువైంది. ఎంతో కష్టపడి నేర్చుకున్న విద్యను ఇంటర్‌నెట్‌లో చూస్తుండడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. నేరుగా సాహస ప్రదర్శనలను తిలకిస్తేనే ఆనందాన్ని ఆస్వాదించవచ్చని నిర్వాహకులు పేర్కొంటున్నారు. మణిపూర్‌ సాహసికులు, కత్తులు నోట్లో పెట్టుకునే విన్యాసాలు, ఒక గ్లోబ్‌లో మూడు బైక్‌లు ఏకకాలంతో తిరిగే ప్రదర్శనలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. సుమారు 25 నుంచి 30 ప్రదర్శనలు రెండు గంటల పాటూ నిర్విరామంగా అందించే వీరికి మూడు పూటలా తినడానికే డబ్బులు చాలక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విన్యాసాలు

చేస్తున్న యువతిలు

‘తీగలపై అలవోకగా నడుస్తారు.. శూలాలపై నిర్భయంగా నిద్రిస్తారు... గ్లోబులో బైక్‌పై గింగరాలు తిరుగుతారు... తాళ్లపై పరుగులు తీస్తారు... వారి బతుకు జీవనం ఆశ్చర్యం.. సాహసాలతో సహవాసం. విన్యాసాలతో వినోదం.. బతుకంతా ఆకలి పోరాటం. సర్కస్‌ కళాకారుల జీవితం కడు దుర్భరం. స్థానిక పెద్దచెరువు రోడ్డులో మాన్సాస్‌ గ్రౌండ్‌లో బింగో సర్కస్‌ ప్రారంభమైంది. పిడికెడు మెతుకుల కోసం కళాకారులు జీవితాంతం సాగిస్తున్న బతుకు విన్యాసాలపై సాక్షి ప్రత్యేక కథనమిది.

కడుపు నింపని సాహస ప్రవృత్తి

బతుకంతా కష్టాలు.. కన్నీళ్లు

సర్కస్‌ ప్రదర్శనలకు కొరవడిన ఆదరణ

పదేళ్ల తర్వాత జిల్లాకు వచ్చిన సర్కస్‌

ఇంటర్‌నెట్‌ వీక్షణంతో తగ్గిన ప్రేక్షకులు

ఆకలి చేయిస్తున్న విన్యాసం1
1/2

ఆకలి చేయిస్తున్న విన్యాసం

ఆకలి చేయిస్తున్న విన్యాసం2
2/2

ఆకలి చేయిస్తున్న విన్యాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement