దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు

Feb 15 2026 9:38 AM | Updated on Feb 15 2026 9:38 AM

దేవాల

దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు

డ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలి

విజయనగరం క్రైమ్‌ : విజయనగరంలోని రింగురోడ్డు ఎస్వీఎన్‌ నగర్‌ సాయిబాబా దేవాలయంలో చోరీకి పాల్పడిన గుషిడి వెంకటేష్‌ను అరెస్టు చేసినట్టు టు టౌన్‌ సీఐ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. సాయిబాబా దేవాలయంలో ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి 1.75 కిలోల విలువ చేసే వెండి ఆభరణాలు దోచుకెళ్లారని సూపర్‌వైజర్‌ బైలపూడి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా క్రైమ్‌ పార్టీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించామని చెప్పారు. నగరంలోని రామకృష్ణనగర్‌ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి తన బైక్‌పై పారిపోతుండగా పట్టుకుని విచారించామని తెలిపారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. టు టౌన్‌తో పాటు విజయనగరం రూరల్‌, నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న ఆలయాల్లో కూడా వెంకటేష్‌ దొంగతనాలు చేశాడని అంగీకరించినట్టు చెప్పారు. నిందితుడి నుంచి మూడు కేసుల్లో మొత్తం చోరీ చొత్తు సుమారు 2.596 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేయడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్‌ఐ కృష్ణమూర్తి, ప్రమీలా దేవి, క్రైమ్‌ టీం సిబ్బంది వాసు, గణేష్‌, సత్యనారాయణ, రామ్మోహన్‌లను ఎస్పీ దామోదర్‌ అభినందించారు. త్వరలోనే వారికి రివార్డులు అందజేస్తామని సీఐ తెలిపారు.

విజయనగరం గంటస్తంభం: మెడికల్‌ డ్రగ్స్‌ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, ఆనందరావులు విమర్శించారు. డ్రగ్‌ మాఫియాకు వ్యతిరేకంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ డ్రగ్‌ మాఫియా పెరిగిపోతోందని, అయినా ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని, అక్రమాలకు పాల్పడుతున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని, ప్రభుత్వమే కళాశాలలను నిర్వహించాలన్నారు. అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ కోరారు.

దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు 1
1/1

దేవాలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement