పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి... | - | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి...

Feb 15 2026 9:38 AM | Updated on Feb 15 2026 9:38 AM

పిచ్చ

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి...

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి...

దిబ్బగుడ్డివలసలో కుక్కల స్వైర విహారం

● పది రోజుల వ్యవధిలో 9 మందికి కుక్క కాట్లు

బొబ్బిలి రూరల్‌: పిచ్చి కుక్కలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. దారిని పోయే ప్రజల పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. ఏ నిమిషం ఏ వైపు నుంచి ఏ పిచ్చికుక్క కాటుకు గురౌతామోనని ప్రజల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామంలో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇంటి గడప దాటుతున్నారు. గ్రామంలో గత పది రోజుల వ్యవధిలో 9 మందికి కుక్కలు కరిచాయి. శుక్రవారం గ్రామ వీఆర్‌ఓ కృష్ణమూర్తి విధుల్లో భాగంగా ఎస్సీ వీధిలోకి వెళ్లగా వెంటబడి పిచ్చికుక్క కరిచింది. ఆ పక్కనే ఉన్న మరో వృద్ధురాలు పోతుల సావిత్రిని, సీతానగరం మండలంలోని బఽంధువుల ఇంచికి చుట్టుపు చూపుగా వచ్చిన రామకృష్ణ అనే వ్యక్తిని కుక్క వెంటబడి మరీ కరిచింది. దీంతో వీరంతా బొబ్బిలి సీహెచ్‌సీలో ర్యాబిస్‌ వ్యాక్సిన్‌లు వేయించుకుని చికిత్సను పొందుతున్నారు. కాగా గత పది రోజులుగా పిచ్చి కుక్కలు గ్రామంలో స్వైరవిహారం చేస్తూ ప్రజలను వెంట బెడుతున్నాయని, దొరికితే పిక్కలు పీకుతున్నాయని, బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవగానే వాటిని చంపుతున్నా కొత్తగా మరికొన్ని కుక్కలు తయారవుతున్నాయని తెలియజేస్తున్నారు. పరిసర గ్రామాలైన సీతయ్యపేట, గోపాలరాయుడు పేట, గుమ్మిడివరం తదితర గ్రామాల్లోంచి కుక్కలు గుంపులుగా వస్తున్నాయని వాటిని ఇక్కడి పిచ్చికుక్కలు కరవడంతో ఆయా గ్రామాలకు వాటి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

కుక్కకాటుతో బాలుడు మృతి

గ్రామంలో పిచ్చి కుక్క కరిచిన ఘటనలో ఈ నెల 4వ తేదీన రమణ అనే మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు ఈ పిచ్చికుక్కల కాటుకు బలై ప్రాణాలను కోల్పోయాడు. కొద్ది రోజులుగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నా..పంచాయతీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పిచ్చి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి... 1
1/2

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి...

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి... 2
2/2

పిచ్చి కుక్కలు పీక్కు తింటున్నాయి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement