జాతీయ వాలీబాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక
● 24 నుంచి హుగ్లీలో జరగనున్న సబ్ జూనియర్స్ పోటీలు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అర్హత సాధించారు. అనకాపల్లిలో జరగనున్న 16 సంవత్సరాలోపు వయస్సు గల బాల, బాలికలకు సబ్ జూనియర్స్ విభాగంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం ఐదుగురు క్రీడాకారులు అంతర్ రాష్ట్ర బాల, బాలికల పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై న వారిలో జశ్వంత్ (పాచిపెంట), గుణశేఖర్ (జామి), అశ్విని (గరివిడి), గాయత్రీ (రామచంద్రపేట), దివ్య (రామచంద్రపేట) క్రీడాకారులున్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో జురగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గవర సూరిబాబు, కెవిఎఎన్.చిన్నారి, ట్రెజరర్ సన్యాసినాయుడు, జిల్లా గౌరవ అధ్యక్షులు భగవాన్‌దాస్ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు.


