18న చినమేరంగిలో జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

18న చినమేరంగిలో జాబ్‌ మేళా

Feb 14 2026 9:05 AM | Updated on Feb 14 2026 9:05 AM

18న చ

18న చినమేరంగిలో జాబ్‌ మేళా

18న చినమేరంగిలో జాబ్‌ మేళా ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి పారమ్మకొండకు 30 ప్రత్యేక బస్సులు ఆకట్టుకున్న వర్ణచిత్రం

పార్వతీపురం: చినమేరంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఈనెల 18న జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పనలో భాగంగా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకొని, 18 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీయువకులు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన యువత తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్‌://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తిస్థాయి ధ్రువీకరణ పత్రాలతో 18న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్‌:63034 93720ను సంప్రందించాలన్నారు.

పార్వతీపురం: ప్రతి ఒక్కరు ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరె డ్డి సూచించారు. కలెక్టరేట్‌లో ఆర్థిక సాక్షరత వారోత్సవం–2026 సందర్భంగా ఆర్థిక సాక్షర త పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేవైసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆర్థిక సాక్షరత వారోత్సవం సందర్భంగా ప్రజ ల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి, జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎస్‌.సోమశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

సాలూరు: మహాశివరాత్రి నేపథ్యంలో పాచిపెంట మండలం చీపురువలస సమీపంలోని పారమ్మకొండకు 30 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. సాలూరు ఆర్టీసీ డిపోను ఆయన శుక్రవారం సందర్శించారు. ఆర్టీసీ కండక్టర్లకు టిమ్‌మిషన్‌ చార్జింగ్‌ సమస్యలు తలెత్తకుండా పవర్‌ బ్యాంకులను అందజేశారు. మహాశివరాత్రి జాతర నేపథ్యంలో పారమ్మకొండను ఆయన పరిశీలించారు. మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎం ఆచారి పాల్గొన్నారు.

గరుగుబిల్లి: తెలుగు సాహిత్యం, భారతీయ పురాణ ఇతిహాసాల్లోని శృంగార రసానికి ఆది దేవతులుగా రతీదేవి, మన్మథుడును గుర్తించా రు. వీరి బంధాన్ని కేవలం ప్రేమికులుగానే కాకుండా సృష్టిలోని అనురాగం, సౌందర్యం, వంశాభివృద్ధికి మూలకారకులుగా మన సంస్కృతి గుర్తిస్తుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రతీదేవి, మన్మథుడుల కలయిక వర్ణ చిత్రాన్ని మండలంలోని నాగూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పల్ల పరిసినాయుడు వేసిన వర్ణచిత్రం పలువురిని ఆకట్టుకుంది.

18న చినమేరంగిలో జాబ్‌ మేళా 1
1/1

18న చినమేరంగిలో జాబ్‌ మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement