అమ్మభాష అమృతం.. బోధన ఒక యజ్ఞం
● విద్యార్థుల మనసు గెలవడమే ఉపాధ్యాయుడి లక్ష్యం ● భాషా పండితులకు కలెక్టర్ ప్రభాకరరెడ్డి దిశానిర్దేశం
పార్వతీపురం రూరల్: పుస్తక పాఠాలకే పరిమితం కాకుండా, అమ్మభాషలోని తియ్యదనాన్ని విద్యార్థు ల మనసులకు హత్తుకునేలా అందించాలని.. బోధ న ఓ యజ్ఞంగా సాగించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. పార్వతీపు రం మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి తెలుగు భా షా పండితుల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే లక్ష్యం కాకూడదని, తరగతి గదిలో గంటసేపు విద్యార్థులు మైమరిచిపోయేలా, వినసొంపుగా పాఠాలు చెప్పే నేర్పును ఉపాధ్యాయులు అలవర్చుకోవాలన్నారు. సాహితీ సౌరభం వెదజల్లేలా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలని, అందుకోసం పాఠశాల ల్లో ప్రతి గురువారం ’రీడర్స్ క్లబ్’ ఏర్పాటు చేసి కథలు, కవితలు రాసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సైతం నిరంతర సాహితీ అధ్యయనంతో కథకులుగా ఎదగాలని కోరారు. సృజనాత్మకతను చాటేలా త్వరలోనే జిల్లా స్థాయి ’ఈ–మ్యాగజైన్’ను పునరుద్ధరిస్తున్నట్లు, ఉపాధ్యాయుల రాగయుక్త గీతాలను రాష్ట్రవ్యాప్తంగా చాటేందుకు ప్రత్యేక ‘యూట్యూబ్ చానల్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ఆటపాటలతో సాహిత్యాన్ని నేర్చుకోవాలని, ప్రతి శుక్రవారం తరగతి గదులను అలంకరించి తమ కళా ప్రతిభను ప్రదర్శించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఆర్జేడీ విజయభాస్కర్, డీఈఓ బ్రహ్మాజీరావు, ఇతర అధికారులు, భాషా పండితులు పాల్గొన్నారు.
కోర్టు భవనాల సముదాయానికి
స్థలం పరిశీలించాం
పార్వతీపురం: జిల్లా కేంద్రంలో కోర్టు భవనాల సముదాయం కోసం స్థలాన్ని పరిశీలించామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు వివరించారు. శుక్రవా రం జిల్లా పాలనాధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయనకు కలెక్టర్ వివరించారు. కొత్తగా జిల్లా ఏర్పడడంతో స్థల సమస్యలు, రవాణా తదితర అంశాలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. పదోతరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నామన్నారు.


