ఎరువుల బస్తాపై రూ.100 అదనపు బాదుడు..!
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చినమేరంగిలో ఓ ఎరువుల దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. డీఏపీ బస్తా రూ.1350 అని బోర్డుపై ఉన్నా రూ.1450లు వసూలు చేస్తున్నారు. యూరియా బస్తా రూ.420 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. అయినా అధికారులు కనీసం షాపులను తనిఖీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై షాపు యజమానికి అడిగితే ధరలు పెరిగాయని, వేరే షాపులో రూ.1500వరకు విక్రయిస్తున్నారని తెలపడం గమనార్హం. మండల వ్యవసాయాధికారిణి విజయ భారతిని వివరణ కోరగా.. ధరలు పెరగలేదని, అధిక ధరలకు విక్రయిస్తే షాపు యజమానులపై చర్యలు తప్పవన్నారు.
ఎరువుల బస్తాపై రూ.100 అదనపు బాదుడు..!


