ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ప్రభుత్వ మెడలు వంచుదాం
ఉద్యోగ భద్రత కరువు
ఉద్యోగుల మరణాలపై
విచారణ కమిషన్ వేయాలి
న్యూస్‌రీల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాల హెచ్చరిక
ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై నిరసన
కలెక్టరేట్ వద్ద భోజన విరామ
సమయంలో ఏపీఎన్జీవోల నిరసన
న్యాయమైన డిమాండ్లు
పరిష్కరించాలంటూ డిమాండ్
ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఆందోళన
చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు, మానవహారాల నిర్వహణ
–IIలో
నేడు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. విజయనగరం న్యాయవాదుల
సంఘంలో 544 మంది సభ్యులు ఓటు
హక్కును వినియోగించుకోనున్నారు.
మహాశివరాత్రికి ముస్తాబు
ఉత్తరాంధ్రలో అతి పెద్ద పుణ్యక్షేత్రం రామతీర్థం మహాశివరాత్రి జాతరకు ముస్తాభైంది. వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన రామక్షేత్రంలో
శివరాత్రి జాతరే ప్రత్యేకం.
ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఆధారంగా
వేధింపులు ఆపాలని
ప్లకార్డు
చూపిస్తున్న ఉద్యోగి
పార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీ ల గ్రామంలో నూతన కోర్టు ఏర్పాటుకు ప్రతి పాదించిన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమికి సంబంధించిన రికార్డులు, మ్యాప్‌లను తనిఖీ చేసిన ఆయన.. స్థల విస్తీర్ణం, రవాణా సౌకర్యాల అనుకూలత పై రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. ప్రతి పాదిత స్థలానికి సంబంధించి ఎటువంటి చట్ట పరమైన చిక్కులు లేకుండా నిర్ధారించుకోవాల ని, నిర్మాణ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని చింతాడకు చెందిన గర్భిణి గురువారం వేకువజామున 108లో ప్రసవించింది. గ్రామానికి చెందిన సవర విజ యలక్ష్మికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108కు ఫోన్ చేశారు. సమాచారం మేరకు ఈఎంటీ రాములు, పైలె ట్ రమణలు గ్రామానికి వెళ్లి అంబులెన్స్‌లో తీసుకువస్తుండగా మార్గమధ్యంలో పురిటినొ ప్పులు ఎక్కువవడంతో ఆశ కార్యకర్త సాయంతో వాహనంలో డెలివరీ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తదుపరి వైద్యం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్చగా తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బంది కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
కురుపాం: పార్వతీపు రం మన్యం జిల్లా మె ప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా బీవీ నాగభూషణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సేవలను అందరూ సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే స్వయం ఉపాధి అవకాశాలను అర్హులైన వారందరికీ అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మెప్మా పీడీగా పదోన్నతి పొందడంతో ఆయనకు స్థానిక ఎంపీడీఓ, సిబ్బంది అభినందనలు తెలిపారు.
విజయనగరంక్రైమ్: హెచ్‌ఆర్‌సీ, ఆర్టీఐ అధికారులమంటూ ఎవరైనా దోపిడీలకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పని ఎస్పీ దామోదర్ గురువారం హెచ్చరించారు. అధికారుల పేరుతో అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తుల సమాచారం అందిస్తే రౌడీ షీట్స్ తెరుస్తామన్నారు.
పార్వతీపురం రూరల్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ నినదించారు. ఖబడ్దార్.. ఖబడ్దార్ అంటూ ప్రభుత్వాలను హెచ్చరించారు. నాలుగు లేబర్‌కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, అంగన్‌వాడీ, ఆశ, మిడ్‌డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని, ఉపాధిహామీ పనులను 200 రోజులకు పెంచి రూ.600 వేతనం ఇవ్వాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ నినదించారు. అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్ల సాధనకు గర్జించిన ఉద్యోగులు
న్యాయమైన డిమాండ్ల సాధనకై ప్రభుత్వ ఉద్యోగులు కదంతొక్కారు. జాతీయ సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం వద్ద నిరసన గళం వినిపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఏకమై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ‘భోజన విరామ నిరసన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జి.వి.ఆర్.ఎస్.కిశోర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న అలసత్వాన్ని ఎండగట్టారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటు, వేతన సవరణ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వైద్య ఆరోగ్య శాఖలో 100 శాతం గ్రాస్ శాలరీ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, పీఎస్‌యూ సిబ్బందికి 62 ఏళ్ల పదవీ విరమణ వంటి అంశాలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంచేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలతకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్, ఏపీటీఎఫ్ నాయకులు బాలకృష్ణ, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు త్రినాథరావు, గణపతిరావు, పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెలో భాగంగా సాలూరు పట్టణంలో నిరసన ర్యాలీ
పాలకొండలో కార్మిక సంఘాల ర్యాలీ
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.32 వేల కోట్లకు చేరాయి. పీఆర్సీ కమిషన్ల పేరుతో ప్రభుత్వం ఆడుతున్న కాలయాపన క్రీడ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల ముందర అరకొర ప్రయోజనాలు విదిల్చే దాకా వేచి చూసే ఓపిక మాకు లేదు. హక్కుల సాధన కోసం యూటీఎఫ్ నడుంకట్టింది. సమస్యల పరిష్కారం కోసం గళం ఎత్తింది. ఈ నెల 17న 20 వేల మందితో సాగే ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ తోడవ్వాలి. ఐక్యంగా కదంతొక్కి ప్రభుత్వ మెడలు వంచుదాం.
– ఎం.మురళీమోహన్, యూటీఎఫ్
రాష్ట్ర కార్యదర్శి, పార్వతీపురం మన్యం జిల్లా
కొత్తగా తెచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ ఉపా ధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల సంఘటిత శక్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ‘హైర్ అండ్ ఫైర్’ విధానం ఉద్యోగ భద్రతను నాశనం చేస్తుంది. రోజుకు 8 గంటల పనివిధానం నుంచి 12 గంటలకు పెంచడం, ఓవర్ టైమ్ త్రైమాసికానికి 125 గంటల వరకు పెంచడం వంటి కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైన మార్పులు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మెచేసే హక్కును కూ డా నియంత్రించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ కోడ్స్‌ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు బానిసలుగా మారే ప్రమాదం ఉంది.
– నల్లా బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి,
ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. రావా ల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలల ఎరియర్స్, పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల ఎన్పీఎస్ నిధుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అంతుచిక్కని పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సిబ్బంది మరణాలపై తక్షణమే విచారణ కమిషన్ వేయాలి. పండగలు, సెలవు దినాల్లో సర్వేల నుంచి మినహాయింపునిస్తూ, అవసరమైన స్టేషనరీని ప్రభు త్వమే కేటాయించాలి.
– సీహెచ్ శంకరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..
ఖబడ్ద్దార్.. ఖబడ్దార్..


