సెక్యూరిటీ జాబ్‌ ! | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ జాబ్‌ !

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

సెక్యూరిటీ జాబ్‌ !

సెక్యూరిటీ జాబ్‌ !

సెక్యూరిటీ జాబ్‌ !

ÌZMýS…Ððl$^óla BçœÆŠḥ..

నెల్లిమర్ల యూత్‌ ఎట్‌ హైదరాబాద్‌ సెక్యూరిటీ!

వందరోజుల్లో వంద ఉద్యోగాలంటూ పొల్లు కబుర్లు

ఆఖరుకు సెక్యూరిటీ గార్డుల కోసం జాబ్‌ మేళా

పోయాం మోసం అంటున్న నెల్లిమర్ల యువకులు

సాక్షిప్రతినిధి, విజయనగరం: నువ్వు చెప్పలేదా రామకృష్ణా... మనం చెప్పామంటే మీ పని అయిపోయినట్లే.. జస్ట్‌ తోడుకోవడం.. అమ్ముకోవడం.. తోడుకోవడం.. అమ్ముకోవడం.. ఏంటిదీ.. అదే దుబాయ్‌లో మీకు తలో ఆయిల్‌ బావి ఇస్తారు.. తోడుకోవడం అమ్ముకోవడం.. ఇదే ఇక మీ పని.. నన్ను నమ్మండి.. మే హూనా.. ఈ సన్నివేశం.. డైలాగ్స్‌ ఏదో సినిమాలో చూసినట్లుంది కదా.. అవును దుబాయ్‌ శీను సినిమాలో చూసిన సీను ఇది.. కట్‌ చేస్తే ఆ బ్యాచ్‌ మొత్తం బ్రోకర్‌ చేతిలో మోసపోయి ముంబయి రోడ్ల మీద పావ్‌ భాజీ షాప్‌ పెట్టుకుని బతుకుతుంటారు.

అచ్చం నెల్లిమర్ల యూత్‌లో పలువురి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే మాదిరిగా కనిపిస్తోంది. మీకెందుకమ్మా నన్ను నమ్మండి.. మే హూనా.. నేను గెలిచిన వంద రోజుల్లో వంద కంపెనీలు.. సాఫ్ట్‌ వేరా... హార్డ్‌ వేరా.. కోడింగా .. డెవలప్పింగా.. ఏది కావాలంటే ఆ ఉద్యోగాలు మీ ఊళ్లో క్యూ కడతాయి.. మీరు జస్ట్‌ సంతలో చేపలు ఎంచుకున్నట్లు ఎంచుకోవడమే తరువాయి అన్న రీతిన మేడం గారు.. ఢమఢమ హామీలు ఇవ్వడంతో ఇక మా జీవితాలు మారిపోతాయన్న భ్రమల్లో ఉన్న యూత్‌.. మొత్తం లోకం మాధవి వెంట పరుగులు పెట్టారు. ఆమె ఎన్నికల్లో గెలవడం తరువాయి ఊళ్లకు ఊళ్లు సాఫ్ట్‌వేర్‌ హబ్బులుగా మారిపోతాయి... అందరూ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసుకుంటూ సాయంత్రం పూట అలా రయ్యిన విజయనగరానికి షికార్లు పోయి రావచ్చని కలర్‌ఫుల్‌ డ్రీమ్స్‌ వేసుకున్నారు. తీరా చూస్తే.. ఆవిడ వ్యాపారాలు.. దందాలు.. భర్తగారి పెద్దరికం తప్ప ఊళ్లలోకి ఉప్పు దుకాణం కూడా కొత్తగా రాలేదన్నది యువత నోటివెంట వచ్చేమాట. కానీ యూత్‌ తలరాతలు మారుస్తున్నట్లు బిల్డప్పులు.. ప్రచారాలు మాత్రం బాగానే ఇస్తున్నారు. తాము ఏదో కలర్‌ఫుల్‌గా జీవితాన్ని ఊహించుకుంటే కనీసం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కూడా సినిమా రిలీజ్‌ కాకపోవడంతో యువతలో నిర్వేదం.. నైరాశ్యం.. చిరాకు.. చికాకు మొదలైంది. దీంతో ఇక లాభం లేదని మేడం గారు ఎకాఎకిన ఈ నెల 13న శుక్రవారం ఒక జాబ్‌ మేళా నిర్వహణ కోసం ప్రకటన ఇచ్చారు. ఇందులో టీసీఎస్‌, సీసీఎల్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ జాబ్‌ మేళాలో ఎటువంటి ఉద్యోగాల ప్రకటన ఇచ్చారా అని చూసిన కుర్రాళ్లకు చెమటలు పట్టేశాయి. ఇంత ప్రకటన సెక్యూరిటీ ఉద్యోగాల కోసమేనా అంటూ నిట్టూరుస్తున్నారు. కుర్రాళ్లు .. మంచి ఒడ్డు పొడుగు ఉన్నవారిని నెల్లిమర్ల నుంచి తీసుకెళ్లి హైదరాబాద్‌లో సెక్యూరిటీ ఉద్యోగాల్లో పెడతారా.. దీనికోసం ఇక్కడనుంచి అక్కడకు వెళ్లాలా అంటూ మండిపడుతున్నారు. నెల్లిమర్ల యువతకు ఉద్యోగం అంటే ఇంకేదో అనుకున్నాం.. మన యూత్‌ అక్కడికెళ్లి కాపలా పని చేయలా.. ఒద్దొద్దులే పల్లకో అంటూ వారి తల్లిదండ్రులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి నెల్లిమర్ల జనం మొత్తం పోయాం మోసం అనుకుంటూ ఎన్నికలకోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement