భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ వై శ్రీనివాసరావు తెలిపారు. శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులు స్వామి దర్శనానికి ఇబ్బందులు పడకుండా క్యూల ఏర్పాటు జరుగుతుందన్నారు. సీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లోను క్యూలను పటిష్టంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ఆలయం చుట్టూ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు మంచినీరు, మజ్జిగతో పాటు చిన్నపిల్లలకు పాలు సరఫరా చేస్తామని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా రామకోనేరు వద్ద 10 మంది గజఈతగాళ్లను పెడుతున్నామన్నారు. ఈ ఏడాది ప్రసాదాల పంపిణీ స్థలాన్ని మార్పు చేశామని, కల్యాణ వేదిక మైదానంలో లడ్డు, పులిహోర ప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు. ఉత్సవాల విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
ఈఓ వై శ్రీనివాసరావు


