బ్రిడ్జికోర్సును సద్వినియోగం చేసుకోవాలి
బాడంగి: పదవ తరగతిలో వెనుకబడిన పిల్లలకోసం విద్యాశాఖకమిషనర్ ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్సును విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు అన్నారు. ఈ మేరకు జిల్లాలోని 8మండలాలకు చెందిన పదోతరగతిలో వెనుకబడిన సీ,డీ గ్రేడ్ విద్యార్థులు 58 మందికి విద్యాశాఖ స్థానిక గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్స్ తరగతులు ఏవిధంగా సాగుతున్నాయో తెలుసుకునే నిమిత్తం డీఈఓ మాణిక్యం నాయుడు మంగళవారం ఇక్కడికి వచ్చారు. సబ్జెక్టు టీచర్లు వారి వెనుకబాటుకు గలకారణాలను తెలుసుకుని వారిసందేహాలను నివృత్తిచేయాలని డీఈఓ ఈ సందర్భంగా ఆదేశించారు. పిల్లలుచక్కగా చదువుకుని ప్రతి ఒక్కరూ పాస్‌కావాలని అన్నారు. ఈ సందర్శనలో డీఈఓతో పాటు ఎంఈఓలు లక్ష్మణదొర, రాజేశ్వరి, గురుకుల ప్రిన్సిపాల్ కేవీ.రమణ, సీఆర్‌టీలు,సిబ్బంది పాల్గొన్నారు.
షైనింగ్ స్టార్లుగా మారాలి
రైజింగ్‌స్టార్లుగా ఉన్న విద్యార్థులు మరింతబాగా చదివి షైనింగ్‌స్టార్లుగా మారాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు అన్నారు. గురుకులంలో గల బ్రిడ్జికోర్స్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం ఆయన పక్కనేగల పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్‌కు వవెళ్లారు.అక్కడ జరుగుతున్న తరగతులను పరిశీలించారు. హెచ్‌ఎం కార్యాలయంలో ఉపాధ్యాయులందరినీ సమావేశ పరిచి పదోతరగతివారికి 100రోజుల ప్రణాళిక ఏవిధంగా అమలు చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈఓతో పాటు హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


