గురుకులంలో భోజన సమస్య లేదు
● డీసీఓ మాణిక్యం
భామిని: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులకు భోజన సమస్య లేదని గుర్తించినట్లు విజయనగరం గురుకులాల సమన్వయ కర్త(డీసీఓ) మల్లా మాణిక్యం గురువారం స్పష్టం చేశారు. గురుకులం ప్రిన్సిపాల్ విజయ నిర్మలతో కలిసి గురుకుల విద్యార్థులతో మాట్లాడినట్లు వివరించారు. ఇటీవల ఆదివారం మధ్యాహ్న భోజనం ఆలస్యంపై విద్యార్థుల ఆకలికేకలపై విచారణ చేసినట్లు తెలిపారు. ఆ భోజన జాప్యానికి గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతు కారణమని గుర్తించామన్నారు.మిగతా రోజుల్లో యథావిధిగా సమయ పాలనతో భోజనాలు అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫోన్‌లో సిబ్బందితో మాట్లాడానని డీసీఓ మాణిక్యం వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరు పరిశీలించానని, వంట గది, భోజనశాల అన్నీ పరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
గురుకులంలో భోజన సమస్య లేదు


