సైన్స్‌ సంబరానికి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ సంబరానికి వేళాయె..

Dec 19 2025 8:09 AM | Updated on Dec 19 2025 8:09 AM

సైన్స

సైన్స్‌ సంబరానికి వేళాయె..

సైన్స్‌ సంబరానికి వేళాయె..

నేడు జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ పోటీలు

ముగిసిన మండల, నియోజకవర్గ పోటీలు

జిల్లాకు ఎంపికై న 150 ప్రాజెక్టులు

పార్వతీపురం రూరల్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, విద్యార్థుల శాసీ్త్రయ జ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీనిలో విద్యార్థులు, తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. తద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, ఆలోచన శక్తి పెంచడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రయోగాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలను ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొత్త పాత్రలను స్వీకరించడానికి, లోతైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రేరణ కల్పించడమే పరమార్థం.

భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సైన్స్‌ ఇన్‌స్పైర్‌ విజ్ఞాన సంబరానికి వేళైంది. గడిచిన 15 రోజులుగా మండల, నియోజక వర్గ స్థాయిలో సైన్స్‌ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శుక్రవారం జిల్లాస్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్‌ ఫెయిర్‌ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి గత ఏడేళ్లుగా ఎక్కువైంది. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో మండల స్థాయిలో పాల్గొన్నారు. అందులో ప్రతిభ చూపించిన 150 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. గతేడాది పోటీల్లో జిల్లా నుంచి జెడ్పీహెచ్‌ఎస్‌ తలవరం విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయికి వెళ్లడమే కాకుండా జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు జాతీయస్థాయికి వెళ్లి బహుమతులు సాధిస్తాయని ఆశిస్తున్నారు

నేడు జిల్లా స్థాయి పోటీలు

మండల, నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న 1010మంది తయారు చేసిన ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 150 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వాటిలో గ్రూప్‌స్థాయిలో 105 ప్రాజెక్టులు, వ్యక్తిగతంగా 30 ప్రాజెక్టులు, ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించిన 15 ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో గల డీవీఎం ఉన్నత పాఠశాలలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి, ప్రజాప్రతినిధులు, సైన్స్‌ కమిటీ ఈ పోటీలలో ప్రదర్శించే 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.

ప్రతిభ కనబరుస్తున్న మన్యం

విద్యార్థులు

గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, క్లాస్‌ రూమ్‌లలో డిజిటల్‌ బోధన, బైజూస్‌ విధానంలో విద్యాభ్యాసం వంటి మార్పుల కారణంగా గిరిజన విద్యార్థులు విద్య, విజ్ఞాన ప్రదర్శనలపై మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గత ఏడేళ్లుగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో మంచి ప్రతిభ కనబరిచి మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మండల స్థాయిలో 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనడం గమనార్హం. ఈ ఏడాది జాతీయ స్థాయిలో మన్యం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడానికే..

విద్యార్థుల్లో వైజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికి తీసేందుకే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది జిల్లా స్థాయికి 150 సైన్స్‌ ప్రాజెక్టులను ఎంపిక చేశాం. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనను కనబరుస్తారన్న నమ్మకం ఉంది. కేవలం పారదర్శకంగా మాత్రమే ప్రాజెక్టులను ఎంపిక చేసేలా చర్యలు చేపట్టాం. జాతీయస్థాయిలో మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. – లక్ష్మణరావు,

జిల్లా సైన్స్‌ అధికారి, పార్వతీపురం మన్యం

ఉత్తమ ప్రదర్శనలు తేవాలి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలతో ప్రాజెక్టులు చేసి ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ప్రాజెక్టులు గతంలో ఎంపికయ్యాయి. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయికి ఎంపికవుతాయనే అశిస్తున్నాం. జిల్లా కేంద్రంలో డీవీఎంఎం పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలకు సర్వం సిద్ధం చేశాం.

పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం

సైన్స్‌ సంబరానికి వేళాయె..1
1/2

సైన్స్‌ సంబరానికి వేళాయె..

సైన్స్‌ సంబరానికి వేళాయె..2
2/2

సైన్స్‌ సంబరానికి వేళాయె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement