దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
● కాటికి కాలు చాచే వయసులో ఇవేం కష్టాలంటూ వాపోతున్న బాధితులు
విజయనగరం ఫోర్ట్:
ఇలా వీరిద్దరే కాదు. నిత్యం అధిక సంఖ్యలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సదరం రీవెరిఫికేషన్ కోసం దివ్యాంగులు వస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు అష్టకష్టాలు పడి వస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటికి కాలుచాచే వయసులో ఇవేమి కష్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం సదరం రీవెరిఫికేషన్ కోసం పదేపదే తిప్పుతుండడం వల్ల దివ్యాంగులు అవస్థలు పడక తప్పడం లేదు. ముఖ్యంగా ఈఎన్‌టీ విభాగానికి చెందిన దివ్యాంగుల్లో చాలా మందికి రీవెరిఫికేషన్ పూర్తయినప్పటికీ మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలని పిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చే పింఛన్ మాట దేవుడెరుగు. వెరిఫికేషన్‌కు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు


