వైభవంగా గోదాదేవి పల్లకి సేవ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత గోదాదేవి పల్లకి సేవను అర్చకులు చేపట్టారు. అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం యాగశాలలో విశేష హోమాలు, స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి సన్నిధిలో తిరుప్పావై సేవా కాలములు జరిపించి స్వామికి ఆరాధన చేశారు.
చెరకు తోట దగ్ధం
రేగిడి: మండల కేంద్రం రేగిడిలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరకు చెత్తకు అగ్గిపెట్టడంతో ప్రమాదవశాత్తు చెరకు తోటలకు నిప్పంటుకుంది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లావేటి విష్ణుమూర్తి, ముంజేటి సన్యాసినాయుడు, జల్లు సాయిరాం జల్లు సింహాద్రి, కరణం గోవింద, ముంజేటి వెంకటప్పలనాయుడు తదితర రైతులకు చెందిన చెరకు పంట దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. చక్కెర కర్మాగారం యాజమాన్యం స్పందించి కాలిన చెరకుకు కటింగ్ ఆర్డర్ ఇప్పించి తరలించాలని బాధితులు కోరుతున్నారు.
పాపం పసివాళ్లకు సాయం
● ముందుకు వచ్చిన దాతలు
గజపతినగరం: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన మైలపల్లి విజయ్, మైలపల్లి గౌతమ్‌లతో పాటు రామయ్యపాలెం కొత్తూరుకు చెందిన మరో పిల్లవాడు ముంతాగౌతమ్‌లకు గజపతినగరం మండల ఉపాధ్యాయ బృందం దాతృత్వంతో రూ.20వేల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పిల్లల తల్లిదండ్రులు మృతి చెందడంతో వారు అనాథలయ్యారు. ఆ పిల్లలకు గురువారం గజపతినగరం మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిణి విమలమ్మ, ఎంఈఓ–2 సాయిచక్రధర్‌ల చేతులు మీదుగా నగదు, వస్త్రాలను, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అంద జేశారు. పాపం పసివాళ్లు అనే శీర్షికన ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసిన దాతలు స్పందించి ముందుకు వచ్చి అనాథ పిల్లలకు సహకారం అందజేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
దత్తిరాజేరు: మండలంలోని ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన అలజింగి సన్యాసప్పడు(55)ను కొద్ది రోజుల క్రితం వెనుక నుంచి ట్రాక్ట ర్ ఢీకొనడంతో గాయపడగా వైజాగ్‌లోని కేజి హెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్ జయంతి తెలిపారు. ఈనెల 12వ తేదీన అదే గ్రామాని కి చెందిన ఇనుముల సత్యనారాయణ ట్రాక్టర్ ను నిర్లక్ష్యంగా, వేగంగా, నడిపి సన్యాసప్పడును వెనుక నుంచి ఢీకొట్టడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
మహిళ ఆత్మహత్య
సీతంపేట: మండలంలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి (35) అనే గిరిజన మహిళ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆరునెలలుగా కడుపులో నొప్పితో ఆమె బాధపడుతోంది. ఈనెల 15న కడుపులో నొప్పి ఎక్కువవడంతో ఇంటిలో ఉన్న గడ్డిమందును తాగేసింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త శోభన్‌బాబు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేయగా రిమ్స్‌లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ట్టు దోనుబాయి ఎస్సై ఐ మస్తాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి నట్లు చెప్పారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వైభవంగా గోదాదేవి పల్లకి సేవ
వైభవంగా గోదాదేవి పల్లకి సేవ


