విలేకరిని గాయపరిచిన ఆటోడ్రైవర్
బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన జాగాన సత్యనారాయణ అనే ఒక దినపత్రిక విలేకరిని (సాక్షికాదు) రామభద్రపురం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ దిలీప్ కొట్టిగాయపరిచినందున కేసునమోదుచేసినట్లు ఎస్సై తారకేశ్వరరావు మంగళవారం తెలిపారు. మధ్యాహ్నం సత్యనారాయణ స్వగ్రామం వద్ద మెయిన్‌రోడ్డు పక్కన ఇద్దరిమధ్య జరిగిన ఘర్షణలో విలేకరి ముఖం భాగాన ఆటోడ్రైవర్ గాయపరచగా స్థానిక సీహెచ్‌సీలో చేరి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.బాధితుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


