
ఇప్పటికిప్పుడే దిద్దుబాటు చర్యలు
గిరిజన గురుకులంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో అధికారులు ఇప్పటికిప్పుడు ఎకాఎకిన దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. చేతులు కాలికా ఆకులు పట్టుకున్నట్లుగా పిల్లలు ప్రాణాలు పోయాక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని చెబుతున్నారు. స్కూల్ ప్రాంగణంలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను ఉపాధి హామీ వేతనదారులతో తొలగిస్తున్నారు. పాడై పోయి నిరూపయోగంగా మారిన మరుగుదొడ్లను బాగు చేయిస్తున్నారు. ఈ తాత్కాలిక ఉపశమన చర్యలు తప్పితే శాశ్వతమైన పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టిసారించడం లేదని గిరిజన సంఘాల నాయకులు, పిల్లలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికిప్పుడే దిద్దుబాటు చర్యలు