
కూటమి ప్రభుత్వంలో రేషన్ కష్టాలు
● వాపోతున్న గిరిజనులు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో గిరిజన ప్రజలు రేషన్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాలూరు మండలంలోని తోణాం జీసీసీ డిపోకు గిరిజనులు రేషన్ సరుకుల కోసం శనివారం పిల్లలను పట్టుకుని వచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వంలో పెద్దలతో పాటు చిన్నారులకు రేషన్ కష్టాలు తప్పడం లేదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.మరోవైపు ఆ రేషన్ సరుకులను అతికష్టంమీద జీపుల్లో ప్రమాదకరప్రయాణాలు చేస్తూ గిరిజనులు తమ గ్రామాలకు తీసుకువెళ్తున్నారు. దీంతో రేషన్‌సరుకుల కొనుగోలు కంటే వాటిని ఇంటికి తీసుకువెళ్లేందుకు అఽధికంగా డబ్బులు ఖర్చవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సుఖంగా రేషన్ సరుకులు ఇండ్ల వద్దనే తీసుకునేవారమని పలువురు గిరిజనులు నాటి రోజులను గుర్తుచేసుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వంలో రేషన్ కష్టాలు