
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఉభాలు జరగని వరిపొలాలు
వర్షాధారమే..
వరుణుడు కరుణిస్తేనే పంటలు పండుతాయి. లేదంటే కష్టమే. ప్రతీ ఏటా కొండపోడు పంటలు ఎక్కువగా పండేవి. ప్రస్తుతం అవి కూడా లేవు. వర్షాలు పడితే ఖరీఫ్‌లో వరి, రాగులు వంటివి వేసుకోవాల్సింది. గెడ్డలు అడుగంటడం, చెరువులు, చెక్‌డ్యాంలలో నీరు నిల్వలు లేకపోవడంతో ఈ ఏడాది ఇబ్బందులు తప్పవు.
– ఎన్. అబ్బాస్, కుశిమి
ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు
ప్రతీ ఏటా ఈ సీజన్ వచ్చేసరికి వర్షాలు పడేవి. పంటలు వేసుకునే వాళ్లం. ఎప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో పంటలు వేయలేదు. ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకోవాలి.
– ఎస్.సన్నాయి, చాపరాయిగూడ
● అడుగంటిన చెక్‌డ్యాంలు, చెరువులు
● నీరు నిల్వలేని గెడ్డలు
● కరుణించని వరుణుడు
● ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కాని ఉభాలు
● ఆందోళనలో ఏజెన్సీ రైతాంగం
ఏజెన్సీలో
ఖరీఫ్ గట్టేక్కేనా..!
సీతంపేట: నైరుతి రుతుపవనాలు మే నెలలోనే వచ్చేశాయని రైతులు ఆనందపడ్డారు. ఆ ఆనందం ఎంత కాలం నిలవలేదు. జూన్ నుంచి వరుణుడి కరుణలేదు. చుక్క చినుకు లేక పొలాలు బీడు వారుతున్నాయి. ఆగస్టు వచ్చినా వర్షాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉభాలు ఇంకా జరగలేదు. దిక్కుతోచని స్థితిలో మన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏ పరిధి సబ్‌ప్లాన్ మండలాల్లో 80 శాతం వర్షాధార పంటలే. వానలు పడితేనే పంటలు పండుతాయి. లేకపోతే గడ్డు పరిస్థితి తప్పదు. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటలు ఎలా పండుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా చెక్‌డ్యాంలు, చెరువులు గతంలో నిర్మించారు. అవి కూడా అడుగంటిపోయి కనిపిస్తున్నాయి. చెక్‌డ్యాంలు నిర్మించి ఏళ్లు గడిచాయి. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు సైతం నీరు లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఖరీఫ్ గట్టెక్కుతుందా.. లేదా.. అనేది ప్రశ్నార్దకంగా మారింది. వేసవిలోనే చెక్‌డ్యాంలు, చెరువులు అడుగంటిపోయాయి. రబీ పంటలు సైతం పండక రైతులు ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం వర్షాలు అనుకున్నంతగా కురవకపోవడంతో ఖరీఫ్ పంటలు ఎలా పండించాలని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎస్‌ఎంఐ విభాగం ద్వారా లక్షలాది రూపాయిలు వెచ్చించి నిర్మించిన చెక్‌డ్యాంలు, చెరువులు వృథాగా పడి ఉంటున్నాయి. కొన్ని మరమ్మతలకు గురయ్యాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ మండలాల్లో ఖరీఫ్ సీజన్లో భాగంగా 13 వేల హెక్టార్‌లలో వరి పండుతుంది. మిగతా చిరుధాన్యాల పంటలు మూడు వేల హెక్టార్ల వరకు పండుతున్నాయి. ప్రతీ ఏటా ఈ సీజన్‌లో ఈ పాటికే వర్షాలు పడేవి. ఉభాలు చేసి వరినాట్లు వేసేవారు. కొద్ది రోజుల కిందట ఆకుమడులు తయారు చేసి వరినారు వేశారు. అవి మొలకలు వచ్చాయి. వర్షాలు లేని కారణంగా 30 శాతం కూడా ఉభాలు జరగని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ఉభాలు ఊపందుకున్నాయి. ఇక్కడ మాత్రం ఆకుమడులే కనిపిస్తున్నాయి తప్ప ఉభాలు లేవు. మెట్టపంటలకు కూడా ఆ మాత్రం వర్షాలు అవసరం ఉంది. ఈ సీజన్‌లోనే కంది ఇతర చిరుధాన్యాల పంటలు కూడా వేస్తారు. ఈ తరహా పంటలకు సైతం మొదట చిరుజల్లులు అయినా అవసరమౌతాయి. ఆ మాత్రం చినుకులు ప్రస్తుతం పడక పోవడంతో ఏం చేయాలో రైతులకు అర్ధం కావడం లేదు.
ఉద్యానవన పంటలకు తప్పని నష్టాలు
ఉద్యానవనాల పంటలకూ నష్టాలు తప్పడం లేదు. ఐటీడీఏ కూడా గతంలో సుమారు 15 వేల వరకు ఉద్యాన వనాల పంటలైన జీడి, మామిడి, పనస వంటి పంటలను ప్రోత్సాహించింది. అంతేకాకుండా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో సైతం ఉద్యానవన మొక్కలు వేశారు. అయితే వీటికి కూడా నీరు లేదు. పసుపు, అల్లం, ఇతర పంటలకు ఈ నెలలో వర్షాలు అవసరమవుతాయి. గెడ్డల్లో నీరు కరువైంది. గిరిజనులకు బోర్లు వంటి సౌకర్యం లేకపోవడంతో నీరెలా పొలాలకు పెడతామని రైతులు వాపోతున్నారు.
న్యూస్‌రీల్

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025