
బళ్లారి రాఘవతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు
విజయనగరం క్రైమ్ : తన రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులను దివంగత బళ్లారి రాఘవ తీసుకువచ్చారని ఏఎస్పీ పి.సౌమ్యలత అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాఘవ జయంతి డీపీవోలు శనివారం నిర్వహించారు. ముందుగా రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవ తెలుగు కళా రంగానికి విశేషమైన సేవలందించారన్నారు. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, రాజకీయ నాయకునిగా విభిన్నమైన రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారన్నారు. పౌరాణిక నాటకాల్లో పద్యాల వినియోగం తారా స్థాయిలో పెరిగిందని వీటిని తగ్గించి నటనకు ప్రాధాన్యత కల్పించే విధంగా పాత్రలను తీర్చిదిద్దాలన్నారు. నాటక రంగంలో సీ్త్రలను ప్రోత్సహించి నాటక రంగానికి తద్వారా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాఘవ అన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ బి.సుధాకర్, ఆర్‌ఎస్‌ఐ ఎన్.గోపాలనాయుడు, ఏవో పి.శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.