
10న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం: జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఆగస్టు 10న విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్‌లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షులు డాక్టర్ మజ్జి శశిభూషణ్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం పోటీల నిర్వహణకు సంబందించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 సంవత్సరాలలోపు వయస్సు గల సీ్త్ర, పురుషులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మొత్తం 10 కేటగిరీల్లో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జనరల్ సెక్రటరీ నరసింహమూర్తి 7702134568 నంబరుకు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వడ్లమాని నరసింహమూర్తి, పి.సత్యనారాయణ, డి.శివ తదితరులు పాల్గొన్నారు.