
జాతీయ బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. శనివారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల విశాఖలో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాల, బాలికల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో క్రీడాకారుడు బి.సచిన్, ఎం.జాహ్నవిలు బంగారు పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న ఇరువురు క్రీడాకారులు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరగనున్న పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డోలా మన్మధకుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఇందుకూరి అశోక్‌రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, రాకేష్‌కుమార్, మెహబూబ్ షరీఫ్, శాప్ కోచ్ బి.ఈశ్వర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.