
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.పావని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహర దీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ పూర్తి అయిన తరువాత పీజీ చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, జిల్లా కేంద్రాల్లో పీజీ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని, కార్పొరేట్‌లను ప్రోత్సహించేలా విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు.
విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఏఎన్‌ఎంలను నియమించకపోవడంతో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా యన్నారు. ఈ దీక్షలకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టి.అఖిల్, ఎం.సంధ్య, కె.డేవిడ్, ఎ.గంగారావు, ఎం.సురేష్, జి.సంజీవ్, సింహాచలం, రాజేష్, చంటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ నిరాహార దీక్ష