
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
పార్వతీపురంటౌన్:
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్‌ఎస్.శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ సుధారాణిలతో కలిసి ప్రజల నుంచి 112 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఆర్.కృష్ణవేణి, జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ ఎస్ మన్మథరావు, సర్వే ఎ.డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
వాస్తవాలైతే చట్టపరమైన చర్యలు
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైతే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చట్టపరిధిలో నాణ్యమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధి నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదులలో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలు ఉన్నాయి. మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్‌కు 72 అర్జీలు
ీసతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 72 అర్జీలు వచ్చాయి. చొర్లంగిలో సీహెచ్‌డబ్ల్యూవో పోస్టు ఇప్పించాలని కోడూరుకు చెందిన నీలవేణి కోరారు. హడ్డుబంగి పాఠశాలలో నాడు–నేడు పనులకు బిల్లులు మంజూరు చేయాలని ఎ.గాయత్రి అర్జీ ఇచ్చారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమకాలేదని కారెంకొత్తగూడకు చెందిన సవర మల్లమ్మ వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ కుమార్, డిప్యూటీ ఈఓ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ