
వైద్యుడు దేవుడితో సమానం
● విపత్కకాలంలోనూ రోగులకు సేవలు ●నేడు వైద్యుల దినోత్సవం
విజయనగరం ఫోర్ట్: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. రోగులు వైద్యుడిని భగవంతుడిలా అరాధిస్తారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టగలిగే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నైనా వెరవకుండా ధైర్యంగా సేవలు అందించేది వైద్యులే. నాలుగేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేసినప్పటికీ వైద్యులు ఏమాత్రం భయపడకుండా వైద్యసేవలు అందించారు. వైద్యుల్లో సేవాదృక్పథంతో పనిచేసే వారు ఉన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేసే వారు కూడా ఉన్నారు. సమాజంలో కొత్త కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వాటి నివారణ చర్యలు కనుగొని వైద్యులు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగులకు సేవలందించే సమయంలో కోవిడ్ బారిన పడి పలువురు వైద్యులు మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ మిగిలిన వైద్యులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కోవిడ్ బాధితులకు సేవలు అందించారు.
జిల్లాలో 700 మంది వరకు వైద్యులు
జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, 300 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో సుమారు 700మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు.
వైద్యవృత్తి ఉన్నతమైనది
వైద్యవృత్తి ఉన్నతమైనది. ప్రజలు డాక్టర్‌ని గౌరవించాలి. వైద్యం కోసం వచ్చే వారితో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని అందించాలి. వైద్యవృత్తిని చేపట్టినందుకు అదృష్టంగా భావించాలి. ప్రతి రోగిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి
డాక్టర్ శంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రి
వైద్యులు గౌరవప్రదంగా
మెలగాలి
సమాజంలో వైద్యులు గౌరవప్రదంగా మెలగాలి.
వెద్యులను ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. వైద్యులపై ఒత్తిడి పెట్టకూడదు. ఒత్తిడి లేకుండా ఉంటే మెరుగైన వైద్యసేవలు అందించగలరు. వైద్యులు రోగులకు ప్రేమతో సేవలు అందించాలి.
డాక్టర్ పద్మశ్రీ రాణి,
డీసీహెచ్‌ఎస్
సేవాభావం ఉంటే వైద్య వృత్తి చేపట్టాలి
ఓపిక, సహనం ఉంటేనే వైద్య వృత్తిని చేపట్టాలి. సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేయాలి. ఆధునాతన వైద్యసేవలను ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలి. రోగులు వైద్యులను గౌరవించాలి.
డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

వైద్యుడు దేవుడితో సమానం

వైద్యుడు దేవుడితో సమానం

వైద్యుడు దేవుడితో సమానం