
కూటమి పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్లు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు
విజయనగరం గంటస్తంభం: కాంగ్రెస్, తెలుగుదేశం, నేటి కూటమి ప్రభుత్వాలు గత 20 ఏళ్లుగా కాగ్నిజెంట్, టీసీఎస్, జిందాల్ లాంటి కంపెనీలకు కారుచౌకగా భూములను కట్టబెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయం డీఎన్‌ఆర్ అమర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కోనేటి రంగారావు భూకమిటీ సిఫార్సులను అనుసరించి నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఎకరా భూమి కూడా పేద రైతులకు, పేదలకు 3 సెంట్లు ఇంటి స్ధలం ఇచ్చిన ధాఖలాలు లేవని మండిపడ్డారు. భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను, నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించడమే కానీ పేదలకు భూమి ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వాలు కార్బొరేట్లకు మాత్రం వేలాది ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెడుతున్నాయని విమర్మించారు. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజవర్గం బౌడార ప్రాంతంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1100 ఎకరాల్లో 900 ఎకరాలు ప్రభుత్వ భూమిని జిందాల్ కంపెనీకి ఇవ్వడానికి తలపెట్టి బాకై ్సట్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆనాటి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందన్నారు. ప్రస్తుత ఉన్న కలెక్టర్ ఇటీవల కాలంలో మీడియాలో ఏ ప్రభుత్వం భూ సేకరణ జరపలేదని మాట్లాడారు. భూ సేకరణ చేయకుంటే ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరిగిందో నేడున్న కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిందాల్ భూముల విషయంలో ఆందోళనకారులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేశారు. పేదలకు అందాల్సిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయని దీనిపై తగు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, అలమండ ఆనందరావు పాల్గొన్నారు.