
చేయి ఎత్తొద్దు!
గొంతు
విప్పొద్దు..
●బ్యానర్లు తెస్తే.. అటు నుంచి అటే... ● పీజీఆర్‌ఎస్‌లో కొత్త ఆంక్షలు
●పోలీసులతో వార్నింగులు ● వినతులిచ్చేవారి గళం నొక్కే ప్రయత్నం
కొత్త ఆంక్షలు.. సరికొత్త నిబంధనలు
అనుమతి లేనిదే నిరసనలు, ర్యాలీలు చేపట్టకూడ దన్నది కొత్తగా యంత్రాంగం తీసుకొచ్చిన నిబంధ న. కనీసం గుంపుగా తమ సమస్య వినిపించుకునేందుకు వచ్చినా.. పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. రెండు రోజుల కిందట పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించేందుకు వస్తే.. కలెక్టరేట్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారిని వెనుకకు పంపించేశారు. తాజాగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలోనూ ఇదే తరహా ఆంక్షలు కనిపించాయి. సాధారణంగా సామాజిక సమస్యలపై సామూహికంగానే వినతులిచ్చేందుకు వస్తారు. ఆయా ప్రాంతంలోని గ్రామస్తులు.. వివిధ సంఘా ల వారు మూకుమ్మడిగా వచ్చి అధికారులను కలిసి తమ మొర వినిపిస్తారు. నెలలు, ఏళ్ల తరబడి ఆ సమస్యకు మోక్షం కలగకపోతే.. కాస్త గట్టిగానే తమ గళం వినిపించి, నినాదాలు చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి ఉంది. అటువంటి గొంతులపైనా కూట మి ప్రభుత్వం కత్తిగట్టింది. కలెక్టరేట్ గేటు దాటి గుంపులుగా వస్తే ఆంక్షలే.. లోపలికి వినతి ఇచ్చేందుకు నలుగురైదుగురు మించి వెళ్లకూడదట. బ్యానర్లు ప్రదర్శించకూడదంట. చేయి ఎత్తి నినాదాలు చేయకూడదు. గొంతు ఎత్తి గట్టిగా తమ వాణి వినిపించకూడదంట! మరి వినతుల పరిష్కారం మాట అని అడిగితే.. ఆ మాటకు సమాధానమే ఉండదంట!! వచ్చిన వారికి పోలీసులతో ప్రశ్నలు, హెచ్చరికలు. ఇన్ని ఆంక్షలు తాము ఎన్న డూ చూడలేదని ప్రజాసంఘాల నాయకులు అంటుంటే.. తామేమీ నిందితులమా, తీవ్రవాదులమా అని సాధారణ అర్జీదారులు వాపోతున్నారు.
అధికారుల వాహనాలకు షెడ్డులు..
అర్జీదారులకు ఆరుబయట గట్లు!
కలెక్టరేట్ ప్రాంగణంలో ఇటీవల పలు మరమ్మతు పనులు చేపట్టారు. గదులు నిర్మించారు. అధికారుల వాహనాల పార్కింగ్‌కు షెడ్లు వేయించారు. పీజీఆర్‌ఎస్‌కు, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారులకు ఆంక్షలు పెట్టి, కట్టడి చేస్తున్నారు. పీజీఆర్‌ఎస్ మందిరంవైపు ఎక్కువ మంది రాకుండా వైర్లతో వలయం కట్టారు. కనీసం వారికి ఆరుబయట వేచి ఉండేందుకు ఏర్పాట్లు సైతం లేవు. సోమవారం వర్షం పడుతున్నా.. చెట్ల కింద, గట్లపైన, గొడుగులు వేసుకునే ప్రజలు అవస్థలు పడ్డారు. అర్జీదారులకు నిలువ నీడ చూపని మన అధికారులు.. తమ వాహనాలు మాత్రం ఎండకు, వానకు పాడవకుండా షెడ్డులు కట్టించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలోని మహిళలు ప్రభుత్వ
పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు. వీరికి
ఐదునెలల జీతాల బకాయిలు ఉన్నాయి. నెలల తరబడి జీతాల బకాయి ఉంటే.. నిరుపేదలమైన తాము ఎలా జీవించగలమని వాపోతున్నారు. పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించేందుకు మూకుమ్మడిగా వస్తే పోలీసులు అడ్డుకున్నారు. పరిమితంగానే లోపలికి వెళ్లి వచ్చేయాలని సూచించారు.

చేయి ఎత్తొద్దు!

చేయి ఎత్తొద్దు!