జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు

Jul 1 2025 4:25 AM | Updated on Jul 1 2025 4:25 AM

జాతీయ

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు

గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల దేశిక్‌, కన్నయ్యగూడకు చెందిన తోయక నరేంద్రనరసింహ ఎంపికై నట్టు కోచ్‌, కొత్తగూడ జీటీడబ్ల్యూహెచ్‌ఎస్‌ పీడీ ఎన్‌.మాధవరావు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జూన్‌ 26వ తేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో దేశిక్‌ అండర్‌ –10, నరేంద్ర నరసింహ అండర్‌–12 ఈపీఈఈ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. విజయవాడలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జూన్‌ 29న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వెల్లడించారు. వీరిద్దరూ మహారాష్ట్రలోని నాశిక్‌లో జూలై 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఇన్‌చార్జి సీపీఓగా పట్నాయక్‌

పార్వతీపురం రూరల్‌: జిల్లా ఇన్‌చార్జి ముఖ్య ప్రణాళిక అధికారిగా ఎస్‌ఎస్‌ఆర్‌కే పట్నాయక్‌ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్ప టివరకు పనిచేసిన పి.వీర్రాజు ఉద్యోగ విరమ ణ చేయడంతో ఆ స్థానంలో విశాఖపట్నం సీపీఓ కార్యాలయ సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న పట్నాయక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గణాంక సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

సచివాలయ ఏఎన్‌ఎంలకు బదిలీ కౌన్సెలింగ్‌

విజయనగరం ఫోర్ట్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సచివాలయం ఏఎన్‌ఎంలకు జూమ్‌లో సోమవారం బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. విజయనగరం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. జీవనరాణి, పార్వతీపురం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భాస్కరరావు, ఏఓ ప్రభూజీ, సూపరింటెండెంట్‌ నాగరాజు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పదోన్నతులు

పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఎస్‌జీ టీలకు స్కూల్‌ అసిస్టెంట్స్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించినట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్‌.కృష్ణవేణి తెలిపారు. పీఓ ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రక్రియను సోమవారం నిర్వహించి 19మందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు కె.దేష్‌, ఏటీడబ్ల్యూఓ ఒ.కె చంద్రబాబు పాల్గొన్నారు.

మడ్డువలసలో ఏనుగులు తిష్ట

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాల్లో తొమ్మిది ఏనుగులు తిష్టవేశాయి. చెరకు, వరినారు మడులను ధ్వంసం చేస్తున్నాయి. వంగర–రాజాం రోడ్డు పక్కన సోమవారం సంచరించడంతో అటవీ, పోలీస్‌ శాఖ సిబ్బంది అప్రమత్తమై రాకపోకలను కాసేపు నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ రేంజర్‌ మణికంఠేశ్వరరావు, సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌  పోటీలకు మన్యం బిడ్డలు 1
1/4

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌  పోటీలకు మన్యం బిడ్డలు 2
2/4

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌  పోటీలకు మన్యం బిడ్డలు 3
3/4

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌  పోటీలకు మన్యం బిడ్డలు 4
4/4

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు మన్యం బిడ్డలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement