పడిపోయిన పైనాపిల్‌ ధర | - | Sakshi
Sakshi News home page

పడిపోయిన పైనాపిల్‌ ధర

Jun 30 2025 4:23 AM | Updated on Jun 30 2025 4:23 AM

పడిపో

పడిపోయిన పైనాపిల్‌ ధర

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2025

నేడు పీజీఆర్‌ఎస్‌ సమావేశం

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారులు నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి

సీతంపేట: కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి సాధ్యమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రాహుల్‌ ఖురానా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం డీఏ జుగా, పీఎం జన్‌మన్‌ పథకాల అమలు తీరును పరిశీలించడానికి సీతంపేట ఏజెన్సీలో రెండో రోజు ఆదివారం మొగదార కాలనీ, డి.బుడగరాయి, చిన్నరామ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పీఎం జన్‌మన్‌ పథకాల ద్వారా నిరుపేద ఆదిమ గిరిజనులకు గృహాలు మంజూరు చేశామన్నారు. గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి అన్ని విధాల అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. వీటిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు లేని చోట కొత్తవి నిర్మించనున్నారని ప్రభుత్వ స్థలం లేకపోతే అవసరమైన ప్రైవేటు స్థలం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలు విన్నారు. అంగన్‌వాడీ స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ వెంకటేష్‌, సీడీపీవో సిమ్మాలమ్మ, పీవీటీజీ కో ఆర్డినేటర్‌ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వరాహ, నరసింహమూర్తి

అవతారాల్లో జగన్నాథుడు

విజయనగరం టౌన్‌: జగన్నాథస్వామి రథయా త్ర మహోత్సవాల్లో భాగంగా కోళ్ల బజారులో కొలువైన బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి ఆదివారం వరాహ, నరసింహమూర్తి అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చ కులు పి.నగేషాచార్యులు, వెంకటరమణాచార్యులు స్వామివారికి పూజాదికాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు.

ఒకటి, ఆరో తరగతుల్లో

ప్రవేశాలు పెరగాలి : కలెక్టర్‌

పార్వతీపురం టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతుల్లో ప్రవేశాలు పెరగాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1, 6 తరగతుల్లో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి విద్యార్థులు చేరేలా శ్రద్ధ కనబరచాలన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లు, వీఆర్‌వోల సహకారం తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రవేశాలన్ని ఈ డ్రైవ్‌ ద్వారా భర్తీ కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌, షూస్‌, నోట్‌ బుక్స్‌ తదితర సామగ్రి కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా తల్లికి వందనం కింద రూ.15 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోన్న సంగతిని కలెక్టర్‌ గుర్తు చేశారు. ఇన్ని వసతులు, లబ్ధిని చేకూర్చే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ప్రతీ ఏటా పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు (పెన్‌) కేటాయించాలని, ఆ నంబరు ఉంటేనే విద్యార్థి రిజిస్టర్‌ అయినట్లవుతుందని తెలిపారు. తద్వారా తల్లికి వందనం వర్తిస్తుందని, ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు పొందాలని, లేకుంటే వాటికి దరఖాస్తు చేయించి పెన్‌ పొందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 1వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్‌ కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ డా. టి.కనకదుర్గ, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సీతంపేట మార్కెట్‌కు ఆదివారం భారీగా పైనాపిల్‌ను గిరిజనులు విక్రయించేందుకు తీసుకువచ్చారు. అయితే ఓ వైపు బోరున వర్షం.. మరోవైపు పడిపోయిన ధరతో ఏం చేయాలో గిరిజనులకు తెలియలేదు. చివరకు ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను మరింత తగ్గించి ఒక్కో పైనాపిల్‌ను రూ.7 నుంచి 10 మధ్య కొనుగోలు చేశారు. గిరిజనులు చేసేది లేక వారికే విక్రయించాల్సి వచ్చింది. గత వారం ఇదే పైనాపిల్‌ను రూ.10 నుంచి 15 వరకు కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల మోసాలకు నష్టాలు చవి చూస్తున్నామని వాపోయారు. – సీతంపేట

న్యూస్‌రీల్‌

పడిపోయిన పైనాపిల్‌ ధర1
1/3

పడిపోయిన పైనాపిల్‌ ధర

పడిపోయిన పైనాపిల్‌ ధర2
2/3

పడిపోయిన పైనాపిల్‌ ధర

పడిపోయిన పైనాపిల్‌ ధర3
3/3

పడిపోయిన పైనాపిల్‌ ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement