
సంగాంలో ఏనుగుల సంచారం
వంగర:సంగాంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. శనివారం అర్ధరాత్రి రేగిడి మండలం సరసనాపల్లి తోటల్లోంచి మడ్డువలస వంతెన కింది భాగం మీదుగా సంగాం పంట పొలాల్లోకి ప్రవే శించాయి. మొక్కజొన్న, చెరకు, వరి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఆదివారం రాత్రి వంగర నుంచి రాజాం వెళ్లే రోడ్డును ఆనుకొని సంగాం పంట పొలాల్లో తొమ్మిది ఏనుగులు తిష్ట వేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ఎలిఫెంట్ టేకర్స్ వాటి వెంట ఉంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.