
శంబరలో 2,399 బస్తాల ఎరువు సీజ్
–8లో
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లాలో పరిపాలన గాడి తప్పుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. కొన్ని శాఖల్లో కుర్చీలాటలు జరుగుతుంటే.. మరికొన్ని చోట్ల ముష్టియుద్ధాలే సాగుతున్నాయి. నువ్వెంతంటే.. నువ్వెంత అనుకున్నంత వరకూ వ్యవహారం ఉంది. ప్రభుత్వ శాఖల్లో క్రమశిక్షణ లోపిస్తున్నా.. సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తుండగా, సయోధ్య కుదర్చాల్సిన ప్రజాప్రతినిధులు ‘రాజకీయం’ చేస్తున్నారు.
●పార్వతీపురం పురపాలక సంఘంలో కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో సిబ్బంది మధ్య విభేదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్లర్లు, ఆర్వో రూబిన్‌ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం, రెవెన్యూ, ప్రజారోగ్యశాఖలోనూ విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా కమిషనర్‌కు, మిగిలిన విభాగాల అధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. ఇటీవల ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. పెన్‌డౌన్ చేపట్టారు. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభావం మున్సిపల్ సేవలపై పడుతోంది. ఉద్యోగులు సైతం ఎవరూ సమయానికి విధులకు హాజరు కాని పరిస్థితి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
● జిల్లా విద్యాశాఖ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజాప్రతినిధులు తానా అంటే.. ఇక్కడి అధికారులు తందానా అంటున్నారు. ఒక్కొక్కరి వెనుక.. ఒక్కో ప్రజాప్రతినిధి ఉన్నారన్న విమర్శలు ఈ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. సాక్షాత్తు డీఈఓ కుర్చీ కోసమే వివాదాలు రేగడం గమనార్హం. మరో ఉద్యోగి తనకున్న పలుకుబడితో ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేస్తూ, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇక్కడ డీఈఓ తిరుపతినాయుడు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా రెగ్యులర్ అధికారిని నియమించలేదు. డీఈఓ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా ఉన్న రమాజ్యోతికి కొన్నాళ్లు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులకే ఇన్‌చార్జి డీడీఈఓగా ఉన్న రాజ్‌కుమార్‌ను నియమిస్తూ, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకంపై విమర్శలు రావడంతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగినా.. మరలా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉన్నట్లు సంఘాల నాయకులు చెబుతున్నారు.
● సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో రెండు రోజుల క్రితం ఈఈ పోస్టుపై కుర్చీలాట చోటుచేసుకున్న విషయం విదితమే. ప్రభుత్వమే తనను ఈఈగా నియమించిందని ఓ అధికారి.. కోర్టు ఉత్తర్వుల మేరకు తానే ఈఈగా కొనసాగుతానని మరో అధికారి ఛాంబర్‌లో వేర్వేరుగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం గమనార్హం.
● గతంలో సాలూరు పట్టణ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు వివాదమైన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయ జోక్యం వల్ల పెద్ద దుమారమే రేగింది. చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
● ఇటీవల పార్వతీపురం తహసీల్దార్‌పై స్థానిక ఎమ్మెల్యే దూషణలకు దిగిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఉన్న విభేదాలే దీనికి కారణమన్న విమర్శలున్నాయి. ఓ వర్గం ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చోద్యం చూస్తున్నారు..
ఈ నాలుగు విభాగాలే కాదు.. జిల్లాలోని పలు శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది. రాజకీయ అండదండలున్న పలువురు ఉద్యోగులు, అధికారులు.. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. వివాదాలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా శాఖల్లో వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఉద్యోగులు పంతానికి పోతున్నారు. ఈ ప్రభావం పరిపాలన, అభివృద్ధిపై పడుతోందంటూ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాలో గాడి తప్పుతున్న
పరిపాలన
ప్రభుత్వ శాఖల్లో
ఇష్టారాజ్యం
ఎవరికి వారే యమునాతీరే..

శంబరలో 2,399 బస్తాల ఎరువు సీజ్

శంబరలో 2,399 బస్తాల ఎరువు సీజ్

శంబరలో 2,399 బస్తాల ఎరువు సీజ్