
అక్కడ నర్సులే.. వైద్యులు!
కొమరాడ: కొమరాడ పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా శనివారం ఒక్కరు కూడా ఆస్పత్రికి రాకపోవడంతో రోగులు, బంధువులు ఆందోళనకు దిగారు. వ్యాధులు ముసురుకున్న వేళ ప్రతిరోజు 80 ఓపీ నమోదవుతోంది. ఈ సమయంలో వైద్యులు రాకపోతే ఎలా అంటూ నిలదీశారు. 24 గంటలు వైద్యసేవలు అందించాల్సిన పీహెచ్‌సీలో కనీసం పగటిపూట కూడా వైద్యులు సేవలందించకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్కడ నర్సులే.. వైద్యులు!