
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శనివారం పయనమయ్యారు. ఈ నెల 29నుంచి విజయవాడలో గల డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో అండర్ – 10, 12 వయస్సుల విభాగాల్లో జరగనున్న పోటీల్లో సైబర్, ఇప్పి, ఫాయిల్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో జిల్లా నుంచి పడాల గణేష్, జాయ్ జబేజ్, టి.నరేంద్ర, హసీనా శ్రీవల్లి, మొహమ్మద్ షేక్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డివి చారిప్రసాద్, సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు అభినందించారు.
తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు క్రీడాకారులు మొత్తం 6 పతకాలు సాధించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా.. ఆరుగురు క్రీడాకారులు పతకాలు సాధించటం విశేషం. పోటీల్లో షణ్ముఖ సిద్ధార్థ గోల్డ్ మెడల్, హర్షవర్ధన్ సిల్వర్ మెడల్, వైష్ణవి దేవి సిల్వర్ మెడల్, రోహిణి బ్రాంజ్ మెడల్, హర్షిని బ్రాంజ్ మెడల్, తరుణ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. అంతేకాకుండా అత్యధిక పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానం దక్కించుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న జిల్లా క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, కోచ్‌లు, యశస్విని, కోటేశ్వరరావు అభినందించారు.
ఒక్క రోజు ఎస్‌ఐగా ఖాన్
● నలుగురు ఏఎస్‌ఐలకు పదోన్నతి
విజయనగరం క్రైమ్: విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో నలుగురు ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో బి.సురేష్ పార్వతీపురం మన్యం జిల్లాకు, డి.సత్యారావును శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. మిగిలిన ఇద్దరు కె. శ్రీనివాసరావు, సర్దార్ ఖాన్‌లను విజయనగరం జిల్లాకు కేటాయించారు. ఎస్‌ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ భోగాపురం ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఆయన్ను సర్దార్ ఖాన్ కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఎస్‌ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1982లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన సర్దార్ ఖాన్ 2009లో ఏఎస్‌ఐగా, ఇప్పుడు ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. సోమవారం రిటైర్ కానున్నారు.

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు