
అరుదైన జువెనరీ గ్లకోమా చికిత్స
బొబ్బిలి: పట్టణంలోని బొబ్బిలి కంటి ఆసుపత్రిలో జాతీయ స్థాయి కంటి శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ కేవీ ఆప్పారావు అరుదైన కంటి శస్త్ర చికిత్స నిర్వహించారు. పార్వతీపురానికి చెందిన నరేంద్ర పంగి అనే మహిళకు చిన్నతనంలోనే గ్లకోమా (జువెనరీ గ్లకోమా)వ్యాధి సోకింది. ఈమె విశాఖ తదితర ప్రాంతాల్లో పలు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందినా నయం కాలేదు. చూపు మరింత మందగించింది. చివరికి డాక్టర్ కేవీ అప్పారావు డాక్టర్‌ను కలసింది. ఆయన చికిత్స చేసి ఇది అరుదైన జువెనరి గ్లకోమా వ్యాధి అని శస్త్ర చికిత్స అవసరమని ఆ ప్రకారం చేయడంతో ఈమెకు కంటి చూపు 70శాతం పైగా వచ్చినట్టు తెలిపారు. అసలు నాకు కంటి చూపు వస్తుందని అనుకోలేదని, బొబ్బిలిలో చికిత్స చేయించుకోవడం వలన తాను మునుపటిలా చూడగలుగుతున్నానని డాక్టర్ అప్పారావుకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఈమెకు 21 సంవత్సరాల వయసులోనే గ్లకోమా వచ్చిందన్నారు. ఇటువంటి వారికి వచ్చే అంధత్వాన్ని జువెనరీ గ్లకోమా వ్యాధి అంటారన్నారు. ఏమాత్రం దృష్టి లోపం ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు.