
ఉద్యోగాల పేరిట మోసం చేసిన నాల్గో వ్యక్తి అరెస్టు
విజయనగరం క్రైమ్ : ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసిన కేసులో నాల్గో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. 2022లో రైల్వే, డాక్‌యార్డులో ఉద్యోగాలిస్తామంటూ నలుగురు ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేశారు. అప్పట్లో అందిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ వెంకటరావు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నాల్గో నిందితుడైన కొత్తవలసకు చెందిన కోసూరు శివ వెంకట సత్యనారాయణను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని సీఐ తెలిపారు. రూ.80వేలు రికవరీ చేసినట్టు తెలిపారు.