శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 28 2025 6:07 AM | Updated on Jun 28 2025 7:31 AM

శనివా

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో పని చేస్తూ.. బదిలీపై వెళ్లిపోవాలని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గట్టి షాక్‌ ఇచ్చారు. వారి స్థానంలో ఎవరైనా వస్తేనే వీరిని రిలీవ్‌ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా విభజన తర్వాత వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం మంది దాదాపు మూడేళ్లుగా ఇక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనో.. ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి విజయనగరం, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం అడిగినంత ఇస్తామని మొత్తుకుంటున్నా.. కదలలేకపోతున్నారు. కీలక విభాగాల్లో పని చేస్తున్న వారి స్థానంలో ఇంకెవరూ రాకపోవడమే కారణం. ఇటీవల దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు జరిగాయి. కొంతమంది కదిలినా.. చాలామందికి మాత్రం స్థాన చలనం కలగలేదు. చాలాకాలంగా బదిలీపై ఇక్కడ నుంచి వెళ్తున్న వారే గానీ.. ఆ స్థానంలో ఎవరూ రావడం లేదు. ఈ ప్రభావం జిల్లా పాలనపై పడుతోంది. జిల్లా అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు తీయకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి. రెవెన్యూ, ఐటీడీఏ, వైద్యశాఖ తదితర కీలక విభాగాల్లో బదిలీల కోసం చూస్తున్న వారు అనేకమంది ఉన్నారు. ఇందులో కొంతమంది తమ పలుకుబడితో ఇక్కడి నుంచి వెళ్లినా.. కొంతమంది మాత్రం ఉండిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల ప్రాంతం కావడం.. ఏజెన్సీగా భావిస్తుండటమే ఇందుకు కారణం.

ఎవరినీ వదలద్దని చెప్పేసిన

ఇన్‌చార్జి మంత్రి..

జిల్లా పరిపాలనకు అవసరమైన సిబ్బందిలో 50 శాతం మందే ఉన్నారని స్వయనా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం జిల్లా పాలనపై పడుతోందని శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఇక్కడ ఉండటానికి ఎవరూ ఇష్టపడకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన.. ఎవరికై నా ఇక్కడ నుంచి బదిలీ అయితే, ఆ స్థానంలో మరొకరు వస్తేనే ముందు వారిని రిలీవ్‌ చేయాలని స్పష్టం చేశారు. అసలు పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేందుకే ఎవరూ ఇష్టపడటం లేదు. ఎవరినైనా ఇక్కడకు బదిలీ చేసినా, కొంతమంది వచ్చి సంతకం పెట్టి, సెలవు మీద వెళ్లిపోతున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనో.. పై స్థాయిలో పరిచయాలతోనో తమ ఉత్తర్వులు రద్దు చేయించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఇక్కడ నుంచి ఎలా వెళ్లగలమని జిల్లాలో పని చేస్తున్న పొరుగు జిల్లాల ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నాళ్లయినా ఇక్కడే ఉండిపోవాలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

రిలీవర్‌ ఉంటేనే బదిలీ స్పష్టం చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి

ఎన్నేళ్లయినా ఇక్కడే చిక్కుకుపోవాల్సిందేనా...

జీతాలు ఇవ్వడం లేదు...

పార్వతీపురం రూరల్‌/పార్వతీపురం: గతంలో ఠంచన్‌గా అందే జీతాలు ఆరు నెలలుగా అంద డం లేదని, అడిగితే ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారని, ఉద్యోగభత్రతో పాటు జీతాలు నెలవారీ చెల్లించేలా చర్యలు తీసు కోవాలంటూ వైఎస్సార్‌ ఉద్యానవన కళాశాల సెక్యూరిటీ గార్డులు మంత్రి అచ్చెన్నాకుడుకు విన్నవించారు. తమను ఆప్కాస్‌లోనే కొనసాగించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో శంకరరావు, రమేష్‌, బ లరాం, ముత్యాలరావు, రామారావు, జమ్మయ్య, భూషణ్‌, రామకృష్ణ, మౌళి తదితరులున్నారు.

మహిళా పోలీసుల పడిగాపులు

సచివాలయ మహిళా పోలీస్‌ సిబ్బందికి శనివా రం జరగనున్న బదిలీలపై స్పష్టత ఇవ్వాలని, ఇతర మండలాలకు వేస్తే ఇబ్బందులు పడతా మంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు విన్నవించేందుకు కలెక్టరేట్‌ వద్ద దాదాపు 4 గంటల సమ యం పడిగాపులు కాశారు. భోజన విరామ సమయంలో కొంతమంది మాత్రమే లోపలకు వెళ్లి మంత్రికి తెలిపే ప్రయత్నం చేసి వినతిపత్రాన్ని అందజేశారు. తమకు సమయం లేదని రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపాల ని మంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఈ బదిలీలపై ఆలోచించడం జరుగుతుందని, ఇప్పుడే ఒక నిర్ణ యానికి రాలేమని మంత్రి సమాధానం ఇచ్చారు. శనివారమే బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో స్పష్టమైన హామీ రాకపోవడంతో మహిళా పోలీసు సిబ్బంది నిరాశతో వెనుదిరిగారు.

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/3

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 20252
2/3

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 20253
3/3

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement