
చిన్నబగ్గ కొండల్లోకి ఏనుగుల గుంపు
సీతంపేట: చిన్నబగ్గ కొండల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. శుక్రవారం ఉదయం కొండదిగువన ఉన్న ఏనుగుల గుంపు సాయంత్రానికి కొండపైకి చేరాయి. జీడి, అరటి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది ఏనుగు ల గమనాన్ని పరిశీలించి గిరిజనులను అప్రమ త్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు.
మన్యం బిడ్డలపై
మలేరియా పంజా
సీతంపేట: మన్యం బిడ్డలపై మలేరియా పంజా విసురుతోంది. మంచం పట్టిస్తోంది. మర్రిపా డు పీహెచ్‌సీ పరిధిలో మలేరియా వ్యాధి అధికంగా ఉంది. శుక్రవారం పీహెచ్‌సీలో ఓపీ 40 వరకు రాగా దీనిలో అధికమంది జ్వరపీడితులే ఉన్నారు. మలేరియాతో సౌజన్య, అఖిల్, అజిత్, నారాయణ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరారు. తోటగూడలో లొంగిరి అనే వృద్ధురాలు, పీవీ ఈతమానుగూడలో ఆరిక అల్లూరి జ్వరంతో మంచం పట్టారు. 80కి పైగా గిరిజన గ్రామాల ప్రజల వైద్యానికి మర్రిపాడు పీహెచ్‌సీయే ఆధారం. గతంతో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. వీరిలో ఒకరు పీజీ చదువుకోవడానికి వెళ్లిపోడంతో కొన్ని నెలలుగా పోస్టు భర్తీకాలేదు. వైద్యురాలు సత్యవేణి ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఓపీ చూడడం, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. మెరుగైన సేవలు అందడం లేదు. కొన్నిసార్లు స్టాఫ్ నర్సులే వైద్యసేవలు అందిస్తున్నారు.
3న వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
● జెడ్పీచైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: వైఎస్సా ర్‌సీపీ జిల్లా విస్తృతస్థా యి సమావేశం వచ్చేనెల 3న నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి కార్పొరేషన్/ మున్సిపల్ చైర్మన్‌లు, ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ/మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాలోగల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిగా కుమారస్వామి
విజయనగరం టౌన్: జిల్లా పర్యాటక శాఖ అధికారిగా పనిచేస్తున్న కుమారస్వామి జిల్లా మైనారిటీ అధికారిగా, కార్పొరేషన్ ఈడీగా ఇన్‌చార్జి బాధ్యతలను శుక్రవారం చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ రెండు పోస్టులలో కొనసాగాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చిన్నబగ్గ కొండల్లోకి ఏనుగుల గుంపు