
సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..
● గంటన్నర పాటు నరకం చూసిన రోడ్డు ప్రమాద బాధితుడు ● ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు ● ఘాట్ రోడ్‌లో ఆటోబోల్తా
సీతంపేట: మొబైల్ సిగ్నల్ లేక.. సకాలంలో 108 అంబులెన్స్ రాక రోడ్డు ప్రమాద బాధితుడు గంట న్నర పాటు నరకం చూసిన ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలంలోని మారుమూలన ఉన్న బంజా రుగూడ–పుట్టిగాం మధ్య ఎత్తైన ఘాట్‌రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో మెట్టూరుకు చెందిన వీరన్నకు తీవ్రగాయాలయ్యా యి. ఈ సమయంలో అక్కడ 108కు ఫోన్ చేద్దామ ని ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎంత ప్రయత్నించినా సెల్‌సిగ్నల్ లేకపోవడంతో వీలుపడలేదు. స్థానికులు సెల్‌సిగ్నల్ చోటకు పరుగుతీసి 108కు సమాచారం అందించారు. సీతంపేట, కొత్తూరు 108 అంబులెన్స్‌లు ఖాళీగా లేకపోవడంతో భామిని అంబులెన్స్ వస్తుందని సమాచారం ఇచ్చారు. మారుమూల ప్రాంతం కావడం, బాధితు ల సెల్‌ఫోన్‌కు సిగ్నల్ లేకపోవడం వంటి కారణాల తో భామిని అంబులెన్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1.50 అయ్యింది. అప్పటికే వీరన్నకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పరామర్శకు వెళ్లి ప్రమాదం పాలై..
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన వీరన్న, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఒకే ఆటోలో మర్రిపాడు మీదుగా కురుపాం మండలం గగాలి గ్రామానికి ఓ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా కొట్ట డంతో ప్రమాదం జరిగింది. ఇందులో వీరన్నకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..