
నాలుగు తరగతులు..!
● ఉపాధ్యాయుడూ ఒక్కరే.. ● ఇదీ ములక్కాయవలస ప్రాథమిక పాఠశాల దుస్థితి
ఒక
గది..
పార్వతీపురం రూరల్:
మానవుడు అంతరిక్షాన్ని చుట్టి వస్తున్న రోజుల్లోనూ గిరిజన ప్రాంత ప్రజలను విద్య, వైద్య కష్టాలు వీడడంలేదు. దీనికి పార్వతీపురం మండలం గోచెక్క పంచాయతీ ములక్కాయ వలస గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలే నిలువెత్తు నిదర్శనం. గత ప్రభుత్వంలో రెండోవిడత నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో పాఠశాల భవనం పునాదులకే పరిమితమైంది. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కనీసం పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం.. విద్యార్థులను వసతి కష్టాలు వెంటాడుతున్నారు. తాత్కాలికంగా వేసిన చిన్న రేకుల షెడ్‌లోనే ఆరు గ్రామాల నుంచి వస్తున్న చిన్నారులకు ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు తరగతుల విద్యార్థులకు ఇరుకు గదిలో బోధన సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగు తరగతులు..!